AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాట తీయండి.. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర్‌ సంచలన ఆదేశాలు..

CM KCR : తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ విషయంలో దోషులు ఎవరైనా ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు.

Telangana: తాట తీయండి.. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర్‌ సంచలన ఆదేశాలు..
Cm Kcr
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2022 | 2:38 PM

Share

CM KCR on Drugs Issue : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల(Drugs ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా.. ఈనెల 28 వ తేదీ శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసిఆర్ అద్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈమేరకు పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లతో ముఖ్యమంత్రి కేసిఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎంవో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 (వెయ్యి) మందితో కూడిన ప్రత్యేకంగా .. ‘‘ నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని సీఎం కేసిఆర్ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనున్నది.

Also Read: ఒకే ఒక్క పాన్ ఇండియా మూవీ బన్నీ క్రేజ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది..