AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS District President: అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన అధినేత కేసీఆర్

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు నడుంబిగించారు.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను పార్టీ చీఫ్ ప్రకటించారు.

TRS District President: అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన అధినేత కేసీఆర్
Trs
Balaraju Goud
|

Updated on: Jan 26, 2022 | 2:26 PM

Share

TRS Party District President: రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతున్నతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS Party).. పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(CM KCR) నడుంబిగించారు.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఖాళీగా ఉన్నా.. జిల్లాల అధ్యక్షులను(District President) ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు TRS పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్లులుగా నియమించిన వారిలో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు MLCకు ముగ్గురు MPలతోపాటు ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లు, మాజీ ఎంపీపీ, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్‌కు సైతం పార్టీ జిల్లా అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.

కొత్త జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరేః

1. ఆదిలాబాద్ – జోగు రామన్న, ఎమ్మెల్యే

2. కొమరంభీమ్ ఆసిఫాబాద్ – కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే

3. మంచిర్యాల – బాల్క సుమన్, ఎమ్మెల్యే

4. నిర్మల్ – విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే

5. నిజామాబాద్ – జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే

6. కామారెడ్డి – ముజీబుద్దీన్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్

7. కరీంనగర్ – రామకృష్ణారావు, ఛైర్మన్ సుడా

8. రాజన్న సిరిసిల్ల – తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ

9. జగిత్యాల – కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే

10. పెద్దపల్లి – కోరుకంటి చందర్, ఎమ్మెల్యే

11. మెదక్ – పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే

12. సంగారెడ్డి – చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే

13. సిద్దిపేట – కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ

14. వరంగల్ – ఆరూరి రమేష్, ఎమ్మెల్యే

15. హనుమకొండ – దాస్యం విజయ్ భాస్కర్, ఎమ్మెల్యే

16. జనగామ – పి సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్

17. మహబూబాబాద్ – మాలోతు కవిత, ఎంపీ

18. ములుగు – కుసుమ జగదీశ్, జెడ్పీ ఛైర్మన్

19. జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి, జెడ్పీ ఛైర్మన్

20. ఖమ్మం – తాతా మధుసూదన్ రావు, ఎమ్మెల్సీ

21. భద్రాద్రి కొత్తగూడెం – రేగా కాంతారావు, ఎమ్మెల్యే

22. నల్గొండ – రవీంద్ర నాయక్, ఎమ్మెల్యే

23. సూర్యాపేట – బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ

24. యాదాద్రి భువనగరి – కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్

25. రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే

26. వికారాబాద్ – మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే

27. మేడ్చెల్ – శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ

28. మహబూబ్ నగర్ – సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

29. నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే

30. జోగులాంబ గద్వాల – బండ కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే

31. నారాయణపేట – ఎస్ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే

32. వనపర్తి – ఏర్పుల గట్టు యాదవ్, మున్సిపల్ ఛైర్మన్

33. హైదరాబాద్ – మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే

Read Also….  Bikram Singh: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో మాజీ డీజీపీ కుట్ర.. అకాలీదళ్ నేత సంచలన ఆరోపణలు!