Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అకాలీదళ్(Akalidal) నేత బిక్రమ్ సింగ్ మజిథియా(Bikram Singh Majithia) కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress) రాజ్యాంగాన్ని గౌరవించమని మాట్లాడుతుందని, అయితే గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందన్నారు. ED ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖ్‌పాల్ ఖైరా డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అయితే, వారెంట్ ఉన్నప్పటికీ, అతనిపై పంజాబ్ రాష్ట్ర పోలీసలు చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పాటు మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ(Siddharth Chattopadhyay)కు గ్యాంగ్స్టర్లతో సంబంధాలున్నాయని ఆరోపించారు.
చండీగఢ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా పెద్ద ఎత్తున ఆరోణణలు చేశారు. మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ గ్యాంగ్స్టర్లతో ఉన్నారని వివరిస్తూ, గ్యాంగ్స్టర్లతో సంబంధాలు ఉన్న డీజీపీ ప్రధాని భద్రతతో రాజీ పడగలరని ప్రశ్నించారు. డీజీపీ ప్రమేయంపై ఎన్ఐఏ దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ, గ్యాంగ్‌స్టర్ కాల్ రికార్డింగ్‌ను ప్రస్తావిస్తూ.. ప్రధాని పర్యటనకు కొద్ది రోజుల ముందు ఓ గ్యాంగ్‌స్టర్‌తో డీజీపీ మాట్లాడుతూ.. మరో మూడు నాలుగు రోజుల్లో మోడీకి కూడా బుద్ధి చెబుతారని అన్నారని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ భద్రతను ఉల్లంఘించిన సమయంలో సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ పంజాబ్ తాత్కాలిక డీజీపీగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. ఆయుధ చట్టంలో సిద్ధూ ముసేవాలాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.పంజాబ్‌లో మజిథియాకు ప్రత్యేక చట్టం ఉందన్నారు.
నామినేషన్ల ప్రక్రియ షురూ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు తొలిరోజు 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కరుణారాజు వెల్లడించారు. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 2న నామినేషన్ పత్రాల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 చివరి తేదీ. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న కౌంటింగ్ జరగనుంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. శిరోమణి అకాలీదళ్‌తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్ దేవ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)తో చేతులు కలిపింది. అలాగే, రైతుల ఉద్యమం నుంచి బయటకు వచ్చిన సంస్థలు కూడా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రైతు నాయకులు ఐక్య సమాజ్ మోర్చా ఏర్పాటు చేశారు. అయితే, యునైటెడ్ సమాజ్ మోర్చా ఏర్పాటు సమయంలో, 22 రైతు సంస్థలు రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు 13 సంస్థలు మాత్రమే మిగిలాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పాల్గొనబోమని 9 రైతు సంఘాలు తెలిపాయి.
Read Also… Republic Day 2022: మరోసారి రాజుకున్న జిన్నా టవర్ వివాదం.. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు..