AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: వేముల‌వాడపై మ‌న‌సు పారేసుకున్న బండి సంజ‌య్.. కారణమేంటో తెలుసా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, పార్లమెంటు సభ్యులు బండి సంజ‌య్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో హాట్ టాఫీక్..

Bandi Sanjay: వేముల‌వాడపై మ‌న‌సు పారేసుకున్న బండి సంజ‌య్.. కారణమేంటో తెలుసా..?
Bandi Sanjay
TV9 Telugu
| Edited By: |

Updated on: Jan 26, 2022 | 2:39 PM

Share

Bandi Sanjay Focus on Vemulawada: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, పార్లమెంటు సభ్యులు బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay Kumar) ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో హాట్ టాఫీక్.. బండి సంజ‌య్ చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మం ర‌చ్చ అవుతుండ‌డం.. మరోవైపు, నేరుగా ముఖ్య‌మంత్రి ప్రెస్ మీట్‌లో సంజ‌య్‌ను టార్గ‌ెట్ చేయ‌డంతో అయ‌న సెంట‌ర్ అఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే, 2023 అసెంబ్లి ఎన్నిక‌లు(Assembly Elections) టార్గ‌ట్ గా బండి పావులు కదుపుతున్నారు. ఏంపీగా ఉంటూనే, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ల‌పై స్పెషల్ ఫోక‌స్ పెట్టారు బండి.. తాజాగా ఎమ్మేల్యే సీటుపై ఆయన మనసు పారేసుకున్నట్లు కనిపిస్తోంది. 2014,2018 అసెంబ్లీీ ఎన్నికల్లో క‌రీంన‌గ‌ర్ నియోజకవర్గం(Karimnagar) నుంచి పోటి చేసి ఓడిపోయిన సంజ‌య్.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ సీటుకు పోటి చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జరిగిన అనుహ్య పరిణామాల్లో తెలంగాణ బీజేపీ ర‌థ‌సార‌ధిగా బాధ్యతలు చేపట్టారు.

2023 ఎన్నిక‌ల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీని న‌డిపించాల్సిన సంజ‌య్ ఎక్క‌డ పోటి చేస్తార‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన క‌రీంన‌గ‌ర్ సీటుకే వెళ్తారా లేదా కొత్త సీటు చూసుకుంటారా అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా అవుతోంది. కరీంన‌గ‌ర్‌లో త్రిముఖ పోటీ ఉండ‌డం.. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు చీల్చుకోవ‌డం, పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉండ‌డంతో అక్క‌డ గెలుపు అవ‌కాశాలు చాలతక్కువ‌నేది అంద‌రికి తెలిసిన విష‌యమే..

అయితే పార్టీ అధ్య‌క్షుడిగా ఉండి ఓడిపోతే ప‌రుపు పోతుంద‌ని భావిస్తున్న బండి.. ఇప్పుడు త‌న కోసం ఒక సీటు వెత్తుకున్నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న పార్లమెంట్ ప‌రిధిలోని వేముల‌వాడ‌పైన మ‌న‌సు పారేసుకున్నారంట. వేముల‌వాడ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సీట్టింగ్ సీటు. అక్క‌డ టీఆర్ఎస్ ఎమ్మేల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్.. వార‌స‌త్వ వివాదం కేసు కోర్టులో న‌డుస్తోంది.. అయ‌న‌ జ‌ర్మ‌నీ పౌర‌స‌త్వం క‌లిగి ఉండ‌డంతో అయ‌న ఎమ్యేల్యే ప‌ద‌వి నుండి తొల‌గించాల‌నే పిటిష‌న్ కోర్టు విచారణ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఎప్పుడైన వేముల‌వాడ‌కు ఎన్నిక‌లు రావోచ్చున‌నే ప్ర‌చారం కుడా జరుగుతోంది. దీంతో వేములవాడలో పాగా వేయాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే బండి సంజయ్ కూడా క‌రీన‌గ‌ర్ క‌ంటే వేముల‌వాడ స్థానం బెట‌ర్ అనీ భావిస్తున్నారు. గ‌ట్టిగా ప‌నీ చేస్తే ఇక్క‌డ విజ‌యం సాధించడం చాలా ఈజీ అనే ఫీలింగ్‌తో ఉన్నారంట.. ఈ నేపథ్యంలోనే ఇటీవ‌ల కాలంలో వేముల‌వాడ బిజేపి నాయ‌కుల‌ను త‌ర‌చు క‌లుస్తున్నారు. అప్పుడుప్పుడు వేముల‌వాడ కార్య‌క్ర‌మ‌లు పెట్టుకుంటున్నారు. ఇటీవ‌ల వేముల‌వాడ గుడిలో ద‌ర్శ‌నం చేసుకుని అక్క‌డ కార్యక‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వహించారు బండి. ఇక, త‌ను వేముల‌వాడ నుండే బరిలో ఉంటున్నాన‌ని ప‌రోక్ష సంకేత‌లు ఇస్తున్నార‌ని బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

అగస్త్య, టీవీ ప్రతినిధి, హైదరాబాద్.

Read Also.. PM Modi: 73వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. ఆ టోపీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్