AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 73వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. ఆ టోపీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంప్రదాయ డ్రెస్​లో కనిపించారు. ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులకు నివాళులర్పించారు.

PM Modi: 73వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. ఆ టోపీ ప్రత్యేకత ఏంటో తెలుసా?
Pm Modi
Balaraju Goud
|

Updated on: Jan 26, 2022 | 12:11 PM

Share

PM Narendra Modi weared Uttrakhand Cap: దేశవ్యాప్తంగా ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గణతంత్ర దినోత్సవ(Republic day) వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు అమరవీరులకు నివాళులర్పించేందుకు బుధవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) సరికొత్త సంప్రదాయ డ్రెస్​లో కనిపించారు. ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులకు నివాళులర్పించారు. ఈ సమయంలో , ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీ(Uttrakhand Cap)ని ధరించి కనిపించారు. అంతేకాదు, ఆయన మెడలో మణిపూర్ స్టోల్‌తో దర్శనమిచ్చారు. ప్రధాని మోడీ వస్త్రాదరణకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మందికి ఈ టోపీ గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది.

ఇందకీ ప్రధాని మోడీ ధరించిన క్యాప్‌లో ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి. అలాగే, ఈ క్యాప్‌పై చేసిన డిజైన్‌కి అర్థం ఏమిటో తెలుసా..? అయితే సోషల్ మీడియాలో కొందరు రాజకీయ రంగు పులుముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రధాని మోడీ ప్రత్యేక టోపీకి సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకోండి…

ఈ టోపీ ప్రత్యేకత ఏమిటి? రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే ముందు ప్రధాని మోడీ గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్‌కి చేరుకున్నప్పుడు, ఉత్తరాఖండ్ టోపీని ధరించి కనిపించారు. అప్పటి నుండి, ఉత్తరాఖండ్ ప్రజలు దీనిపై సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యాప్ గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ ధరించిన టోపీ ఉత్తరాఖండ్ హిల్ క్యాప్. ఈ టోపీ బ్రహ్మ కమలం అనే పుష్పానికి సంబంధించి చిహ్నంగా ఉంది.

ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చిన సోహమ్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ సెంటర్ ముస్సోరీ డైరెక్టర్ సమీర్ శుక్లా TV9తో మాట్లాడుతూ, ‘ఈ టోపీలో బ్రహ్మ కమలం ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. శుభ చిహ్నం. ఇది కాకుండా, దానిలో నాలుగు రంగుల స్ట్రిప్ తయారు చేయడం జరిగింది. ఇది జీవితం, ప్రకృతి, భూమి, ఆకాశం, సామరస్యాన్ని తెలియజేస్తుంది. ఈ టోపీని స్థానిక కళాకారులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ క్యాప్‌లో భూటియా రివర్స్ క్లాత్‌ని ఉపయోగించినప్పటికీ, అది అందుబాటులో లేకుంటే ఉన్ని కోసం ట్వీడ్ క్లాత్, వెచ్చదనం కోసం ఖాదీ క్లాత్‌ని ఉపయోగించారు. సమీర్ శుక్లా ప్రస్తుతం ప్రాంతీయ కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ టోపీని తయారు చేసే పనిలో ఉన్నారు. దీని కారణంగా ఈ క్యాప్ అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. ముందుగా ఈ టోపీలో కుట్టుపని చేసి ఆ తర్వాత చేతితో కట్టు తదితర పనులు చేస్తారు.

ఈ టోపీని ఎవరు తయారు చేశారు? ఈ టోపీని సోహమ్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ సెంటర్ ముస్సోరీ స్వయంగా తయారు చేశారు. తాను ప్రాంతీయ కళాకారులతో పని చేస్తున్నానని, అతని భార్య కవితా శుక్లా కూడా తనతో కలిసి పనిచేస్తోందని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ చెప్పారు. కవితా శుక్లా మహిళలతో కూడిన బృందాన్ని తయారు చేసి చేతితో పూర్తి చేస్తుంది. వారు ప్రస్తుతం తమ టోపీలను దేశానికి, విదేశాలకు పంపుతున్నారు. ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

బ్రహ్మకమలం అంటే ఏమిటి? బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ జాతీయ పుష్పం. ఈ పుష్పం అనేక మత విశ్వాసాలను కలిగి ఉంది. ఈ పువ్వు 61 జాతులు భారతదేశంలో ఉన్నాయని నమ్ముతారు. వీటిలో ఎక్కువ భాగం హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇది అనేక స్వదేశీ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇక్కడ పూజలో ఉపయోగిస్తారు. అలాగే, ఈ పువ్వు శీతాకాలపు దుస్తులలో ఉంచడం జరుగుతుంది. ఇది శీతాకాలపు దుస్తులను పాడు చేయదని నమ్ముతారు. బ్రహ్మకమలం పుష్పం ఆగష్టు నెలలో పెరుగుతుంది. కృష్ణాష్టమికి సంబంధించి ఈ పువ్వుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రామాయణంలో లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోయిన తర్వాత దేవతలు స్వర్గం నుండి కురిపించిన పుష్పాలు బ్రహ్మకమలమని చెబుతారు.

Read Also… Republic Day 2022: రిపబ్లిక్ డే గురించి చాలామందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు..?