AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మంచు వర్షంలో పల్లకిలో ఊరేగిన పెళ్లికొడుకు.. నెట్టింట వీడియో వైరల్‌  

Viral Video: పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దానిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. ఆ మధుర ఘట్టం జీవితాంతం గుర్తుండిపోయేలా..

Viral Video: మంచు వర్షంలో పల్లకిలో ఊరేగిన పెళ్లికొడుకు.. నెట్టింట వీడియో వైరల్‌  
Wedding Barath
Surya Kala
|

Updated on: Jan 26, 2022 | 12:54 PM

Share

Viral Video: పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దానిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. ఆ మధుర ఘట్టం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు. అయితే ఓ పెళ్లి కొడుకు తానేమీ ఎరేంజ్‌ చేసుకోకుండానే అతని వివాహం ప్రత్యేకతను సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని చంబా జిల్లా బిద్రోహ్ నాలా ప్రాంతానికి చెందిన వినీత్ ఠాకూర్‌కు దందోరీ ప్రాంతానికి చెందిన నిషా అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. జనవరి 23న రాత్రి 10 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.

Voice : అయితే, ఉత్తరాదిన జనవరి మాసంలో తీవ్రంగా మంచు కురుస్తుంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో పెళ్లి వేదికను చేరుకునేందుకు వరుడు వినీత్ ఠాకూర్, అతడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బయల్దేరారు. ఇంతలో భారీగా మంచు కురవడం ప్రారంభమైంది. ఓవైపు ముహూర్తం దగ్గరపడుతోంది.. అయినా పెళ్లిబృందం ఎక్కడా తగ్గలేదు. మంచులో కాళ్లు కూరుకుపోతున్నప్పటికీ వరుడ్ని పల్లకీలో మోసుకుంటూ ఆరు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అమ్మాయి, అబ్బాయి జాతకం ప్రకారం ఆ ముహూర్తం దివ్యంగా ఉందని పురోహితుడు చెప్పడంతో అనుకున్న సమయానికే పెళ్లి జరిపించామని వరుడి తరఫు బంధువులు వెల్లడించారు.

Also Read:

Limón Nail Art: నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న వీడియో..

 శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా…