Limón Nail Art: నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న వీడియో..

Limón Lima Nail Art: కొంతమంది కళాత్మకంగా ఉండడానికి ఇష్టపడతారు. తమకు తెలిసిన కళలకు సరికొత్త అలోచనలు జోడించి కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తారు. అలా కొత్త ప్రయోగాలతో చేసిన సరికొత్త అలంకరణలు..

Limón Nail Art: నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న వీడియో..
Limón Lima Art
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2022 | 8:43 AM

Limón Lima Nail Art: కొంతమంది కళాత్మకంగా ఉండడానికి ఇష్టపడతారు. తమకు తెలిసిన కళలకు సరికొత్త అలోచనలు జోడించి కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తారు. అలా కొత్త ప్రయోగాలతో చేసిన సరికొత్త అలంకరణలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Midea)లో హల్ చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా మేకప్(makeup) కు చెందిన సరికొత్త అలంకారణలు చాలామంది క్రియేటర్‌లు మనం ఊహించని వాటితో డిజైన్ చేస్తున్నారు. అలా నుదిటి మీద అలంకారంగా పెట్టుకునే స్టిక్కర్ల, కాటుక, హెయిర్ పిన్స్ ఇలా అనేక అలంకరణ వస్తువులు మార్కెట్ లో వచ్చి అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాంటి అలంకరణలో ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ ఒకటి.. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా ఎక్కువమంది మహిళలను ఆకర్హిస్తోంది. ఈ నెయిల్ ఆర్ట్ లో అనేక రకాలున్నాయి. తాజాగా నెట్టింట్లో కొత్త ఆర్ట్ హల్ చల్ చేస్తోంది. అదే ‘లెమన్ నెయిల్ ఆర్ట్’.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @ilysmnails ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ తన గోళ్ళను నిమ్మకాయ తొక్కలతో అలంకరించుకుంది. తన గోళ్లపై నిమ్మకాయ తొక్కను గమ్ తో ముందు అతికించింది. అనంతరం ఆ నిమ్మకాయ తొక్కలను గోరు షేప్ లో కట్ చేసి.. తర్వాత ఒక జెల్ అప్లై చేసింది. తర్వాత ఒక కటర్ తో నిమ్మతోక్కలమీద పొరను తీసి..గోరుతో సమానంగా అందంగా తయారు చేసింది. సున్నితంగా తయారు చేసిన గొర్ల మీద నెయిల్ పాలిష్ ను అప్లై చేసింది. తర్వాత అందంగా చిన్న చిన్న రాళ్లతో అలంకరించింది. ఈ వీడియో ఇప్పటి వరకూ 2.3 మిలియన్ల వీక్షణలు, 102K లైక్‌లు , వేలకొద్దీ కామెంట్‌లను సొంతం చేసుకుంది. అయితే ఈ లెమన్ నైల్ ఆర్ట్ భిన్నాభిప్రాయాలను సొంతం చేసుకుంది. కొంతమంది నిమ్మ తొక్కలతో ఆర్ట్ చేయడాన్ని భయంకరమైన ఆలోచన అంటూ స్పందిస్తే.. మరికొందరు. మీ క్రియేటివ్ కు అభినందనలు.. ఈ ‘ నెయిల్ ఆర్ట్ ‘బాగుంది’ ‘అందంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by ILYSM Nails (@ilysmnails)

Also Read: రోజు కనీసం 5 వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి.. అనేక వ్యాధులకు చెక్ పెట్టండి..