Garlic Benefits: రోజు కనీసం 5 వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి.. అనేక వ్యాధులకు చెక్ పెట్టండి..

Garlic Benefits: కరోనా వైరస్(Corona Virus) ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది కనుక ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులకు గురవుతున్నారు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని బలి తీసుకుంటున్న..

Garlic Benefits: రోజు కనీసం 5 వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి.. అనేక వ్యాధులకు చెక్ పెట్టండి..
Raw Garlic Benefits
Follow us

|

Updated on: Jan 26, 2022 | 7:57 AM

Garlic Benefits: కరోనా వైరస్(Corona Virus) ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది కనుక ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులకు గురవుతున్నారు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని బలి తీసుకుంటున్న వ్యాదులలో మొదటిప్లేస్ లో గుండె సంబంధిత వ్యాధులుంటే.. రెండవ స్థానంలో క్యాన్సర్(Cancer) బాధితులున్నారు. అయితే లంగ్ క్యాన్సర్, నోటి, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్ల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఆందోళన కలిస్తోంది. అయితే వ్యాధి బారిన పడి వైద్యం తీసుకోవడానికి దానికి అయ్యే ఖర్చును భరించలేక నిస్సహాయంగా చూసేవారు కూడా అనేక మంది ఉన్నారు. అయితే ఈ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిమిగ్నమై ఉన్నారు. శరీరంలోని పేరుకునే చెడు కొవ్వు మోతాదును తగ్గించడానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నాయి అధ్యయనాలు.

వెల్లుల్లి క్యాన్సర్ బారి నుంచి మన శరీరాన్ని రక్షించడమే కాదు..క్యాన్సర్ బాధితులకు ఉపశమనం ఇస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దాదాపు అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ లతో పాటు అనేక రకాల ఇతర జబ్బులను రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 – 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలని సూచిస్తున్నారు.

అయితే ఈ వెల్లుల్లి రెబ్బలు దంచిన వెంటనే తినకుండా ఒక 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి ఆలీల్‌ సల్ఫైడ్‌ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ , యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.

వెల్లుల్లి తినడం వలన క్యాన్సర్ నివారణ మాత్రమే కాదు… తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడుతూ ఇబ్బందు పడే కంటే.. రొజూ తినే ఆహారంలో లేదా ఉదయం వెల్లుల్లి తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు నని అంటున్నారు.

కానీ కొంతమంది వెల్లుల్లి వాసనను, వెల్లుల్లి రుచిని ఇష్టపడకపోవచ్చు. అలాగే వంటకాల్లో కనిపించే వెల్లుల్లి ముక్కలు కొంతమంది పిల్లలు పక్కనపెడతారు. కానీ ఇకపై అలా చేయకుండా.. తినడానికి ప్రోత్సహించండి.

Also Read:

2 ఏళ్ల 11 నెలల 18 రోజులు.. రాజ్యాంగం తయారీకి పట్టిన కాలం.. జనవరి 26నే ఎందుకు అమలు చేశారో తెలుసా?