AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donkey Milk Soap: మీకు చర్మ సమస్యలా.. ముఖంపై ముడతలా.. అయితే గాడిద పాల సబ్బుని ట్రై చేయండి..

Donkey Milk Soap: ఇప్పటి వరకూ అలోవేరా (Aloe Vera), కుంకుమ పువ్వు (Saffron), ఆవు పాలు (Cow Milk) వంటి అనేక రకరకాల సబ్బుల గురించి విన్నాం.. అవసరానికి ఇష్టానికి అనుగుణంగా..

Donkey Milk Soap: మీకు చర్మ సమస్యలా.. ముఖంపై ముడతలా.. అయితే గాడిద పాల సబ్బుని ట్రై చేయండి..
Doneky Milk Soaps
Surya Kala
|

Updated on: Jan 26, 2022 | 7:35 AM

Share

Donkey Milk Soap: ఇప్పటి వరకూ అలోవేరా (Aloe Vera), కుంకుమ పువ్వు (Saffron), ఆవు పాలు (Cow Milk) వంటి అనేక రకరకాల సబ్బుల గురించి విన్నాం.. అవసరానికి ఇష్టానికి అనుగుణంగా వాటిని ఖరీదు చేసి ఉంటాం.. కానీ గాడిద పాల (Donkey Milk) తో కూడా సబ్బులు తయారు చేస్తున్నారు. అదీ మన దేశంలోనే అన్న విషయం అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. ఈ గాడిద పాల ఆర్గానిక్ సబ్బులో అనేక ఔషధ గుణాలున్నాయి. 100 గ్రాముల సబ్బు రూ. 499 లకు లభిస్తుంది. వీటిని చాలా మందిహాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ సబ్బుల తయరీ ఎక్కడ జరుగుతుంది. దీని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

చండీగఢ్‌లో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా దొరుకున్తున్నాయి. అంతేకాదు 2019 ఏడాదిలో జరిగిన ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ ఆరో ఎడిషన్‌లో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాయి. గాడిద పాలతో సబ్బుల తయారీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 2017లో ప్రారంభించబడింది.

గాడిద పాల సబ్బు ఉపయోగాలు: 

గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.వయో భారాన్ని కనిపించనీయని లక్షణాలు ఈ గాడిద పాల సబ్బు సొంతం అంతేకాదు ఈ సబ్బు..

రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తోంది.

ముఖం పై ముడతలను పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

మొటిమలు , బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యల చర్మాన్ని సంరక్షిస్తుంది.

గాడిద పాలలోని సహజ పదార్థాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మం మీద వచ్చే దద్దుర్లు వంటి రాషేష్ ను నిరోధిస్తుంది. చర్మం తేమను సమతుల్యంగా ఉంచుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

గాడిద పాలతో సబ్బు చర్మాన్ని మృదువుగా చేస్తోంది.  .

గాడిద పాల సబ్బును ఉపయోగించే విధానం: 

మీరు గాడిద పాల సబ్బును ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం ఇలా రోజూ మూడు సార్లు వాడాలి.  గాడిద పాల సబ్బును ఉపయోగిస్తున్నప్పుడు..  దానిని నురుగుగా చేసి, మీ ముఖానికి మాస్క్ లాగా చేసుకోవాలి. 5 నిమిషాలు వేచి ఉన్న తర్వాత, మీరు మీ ముఖం కడగవచ్చు. ఈ సబ్బులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు కనుక గాడిద పాల సబ్బును ఎవరైనా ఉపయోగించవచ్చు.

గాడిద పాలకు ప్రీమియం ధర ఉంటుంది. లీటరు గాడిద పాలు రూ.2000 ధర. ఇవి అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటి. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఒక గాడిద రోజుకు గరిష్టంగా ఒక లీటరు పాలను ఇస్తుంది. గాడిద పాలతో తయారీ చేసే సంస్థ ‘ఆర్గానికో’ ఏప్రిల్ 2018లో స్థాపించబడింది. ఈ సబ్బుల తయారీకి ఘజియాబాద్‌లోని దాస్నాలో 25 గాడిదలున్న 10 కుటుంబాలు సహకరించేవి.

ఈ గాడిద పాల సబ్బులకు “తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. వీరికి గాడిద పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మంచి అవగాహన ఉంది. అందుకనే ఈ ప్రాంత ప్రజలు ఎక్కువుగా గాడిద పాల సబ్బులను ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు అంటున్నారు తయారీ దారులు. ఈ సబ్బులు జైపూర్, ఢిల్లీలోని అవుట్‌లెట్లలో కూడా లభిస్తాయి. అంతేకాదు గాడిదపాలతో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్‌ ను తయారు చేస్తున్నారు ఉత్పత్తిదారులు.

Also Read: ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..