CM KCR: ఇది చారిత్రక విజయం.. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండవ దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పోరాడి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా పాలమూరు వర ప్రదాయిని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడం సీఎం కేసీఆర్ చలవేనని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘కుట్రలను ఛేదించి..కేసులను అధిగమించి.. దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చారిత్రాత్మక విజయం. ఆయన మొక్కవోని దీక్షకు.. ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమిది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం. మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టం. పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్నది’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మంత్రి హరీశ్ రావు.
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మరో మంత్రి శ్రీనివాసరావు కూడా ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘పాలమూరు జిల్లా ప్రజల తరుపున గౌరవ సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం కేసీఆర్ కి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలున్నాయి. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసింది. ఇప్పటికే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాయి. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి.. కేంద్రం అనేక కొర్రీలు వేసింది. దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తాం’ అని శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు.




హరీశ్ రావు ట్వీట్
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి..
దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించిన మరో అపూర్వ, చారిత్రాత్మక విజయం. ఆయన మొక్కవోని దీక్షకు.. ప్ర… pic.twitter.com/5G2ixGD4Uy
— Harish Rao Thanneeru (@BRSHarish) August 10, 2023
మంత్రి శ్రీనివాసరావు గౌడ్ ట్వీట్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు..
పాలమూరు జిల్లా ప్రజల తరుపున గౌరవ సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలున్నాయి..
పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసింది..… pic.twitter.com/0SYdIbQhdP
— V Srinivas Goud (@VSrinivasGoud) August 10, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
