AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వీక్ నెస్ బ్రేక్ చేసిన ధోని శిష్యుడు.. కట్ చేస్తే.. ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా

India all-rounder Shivam Dube: టీమిండియా ఆల్ రౌండర్ శివం దుబే ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026లో అద్బుతంగా రాణిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు తన ప్రదర్శనను పెంచుకుంటూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. భారత జట్టు సూపర్ 8 చేరినందున శివం దుబే ప్రదర్శన మరింత కీలకం కానుంది.

ఆ వీక్ నెస్ బ్రేక్ చేసిన ధోని శిష్యుడు.. కట్ చేస్తే.. ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా
Shivam Dube
Venkata Chari
|

Updated on: Feb 19, 2026 | 1:28 PM

Share

India all-rounder Shivam Dube: ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మరింత బలంగా నిరూపించుకుంటూ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నాడు. నమీబియా, పాకిస్తాన్‌లాంటి కఠిన పిచ్‌లపై కీలక క్యామియో ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మొదట నెమ్మదిగా ఆరంభించినప్పటికీ మధ్య ఓవర్లలో వేగం పెంచి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.

ఈ ఆఫ్ స్పిన్నర్ తొలి 11 బంతుల్లో కేవలం 6 పరుగులు చేసినా, ఆ తర్వాత గేర్ మార్చి 31 బంతుల్లో 66 పరుగులతో (ఆరు భారీ సిక్సర్లు సహా) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతనికి రెండో టీ20 వరల్డ్ కప్ అయినప్పటికీ, స్పిన్నర్లపై మాత్రమే కాకుండా పేసర్లపై కూడా సమానంగా ప్రభావవంతంగా మారిన తీరు ప్రత్యేకంగా కనిపించింది.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో లోగన్ వాన్ బీక్ వేసిన వెరియేషన్లను అద్భుతంగా అర్ధం చేసుకుని 3 సిక్సర్లు బాదడం దూబే మెరుగైన పేస్ గేమ్‌కు నిదర్శనం. షార్ట్ బాల్‌పై తన ఆటలో వచ్చిన మెరుగుదలకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మారిన తర్వాత చేసిన కఠిన శ్రమే కారణమని దూబే పేర్కొన్నాడు.

డాట్ బాల్స్ వచ్చినా ఒత్తిడికి లోనుకాకుండా తన బలాలపై నమ్మకం ఉంచుకోవడమే తన విజయానికి కారణమని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దూబే చెప్పాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు దొరకడంతో పరిస్థితులను చదివే సామర్థ్యం పెరిగిందని కూడా పేర్కొన్నాడు.

తన తొలి టీ20 వరల్డ్ కప్ అర్ధశతకం తర్వాత దూబే ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతోంది. “ఈ రోజు నా రోజు అని అనిపించింది. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాలనుకున్నాను. పవర్ హిట్టర్‌గా నాకు పేరు రావడానికి నా బలాలే కారణం,” అని అన్నాడు. సీఎస్‌కేలో చేరిన తర్వాత షార్ట్ బాల్‌పై తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ఆఫ్ సీజన్‌లో గట్టిగా శ్రమించానని వెల్లడించాడు.

బ్యాటింగ్ మాత్రమే కాకుండా దూబే బౌలింగ్‌లో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోంది. అందుకే చివరి ఓవర్‌లో 28 పరుగులు డిఫెండ్ చేయడానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రిత్ బుమ్రా బదులు దూబేకు బంతి అప్పగించడం అతనిపై ఉన్న నమ్మకాన్ని చాటుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us