Telangana: కమీషన్ల కోసం కక్కుర్తి పడటం ఆపండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దళిత బంధు పథకంలో రెండు నుంచి మూడు లక్షల చొప్పున గుడ్ విల్ తీసుకుంటున్నారని.. తాజాగా బీసీ, మైనారిటీ చెక్కులలోను రూ.10 నుంచి 20వేలు కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని అన్నారు. ఇలాంటి పద్దతిని మార్చుకోవాలని సదరు నేతలకు , అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్ననే బీసీ చెక్కుల పంపిణీలో బహిరంగంగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీసీ కుల వృత్తులకు చెక్కుల పంపిణీలో భాగంగా గురువారం జెడ్పి సమావేశ మందిరంలో ఈ వ్యాఖ్యలు చేశారు జోగు రామన్న.
ప్రజల అభివృద్ది కోసం తెచ్చిన స్కీంలు.. ప్రజాప్రతినిధులకు జేబులు నింపే కమిషన్ల స్కాంలు గా మారుతున్నాయంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆదిలాబాద్ లో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు దశలోనే అభాసుపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకొండి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సొంత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న. తాజాగా బీసీ, మైనారిటీ చెక్కుల్లోనూ చోటామోటా నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ నాయకులు పర్సంటేజీలు తీసుకొని అనర్హులకు పథకాల్లో అవకాశం కల్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు పథకంలో రెండు నుంచి మూడు లక్షల చొప్పున గుడ్ విల్ తీసుకుంటున్నారని అన్నారు. తాజాగా బీసీ, మైనారిటీ చెక్కులలోను రూ.10 నుంచి 20వేలు కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి పద్దతిని మార్చుకోవాలని సదరు నేతలకు , అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్ననే బీసీ చెక్కుల పంపిణీలో బహిరంగంగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీసీ కుల వృత్తులకు చెక్కుల పంపిణీలో భాగంగా గురువారం జెడ్పి సమావేశ మందిరంలో ఈ వ్యాఖ్యలు చేశారు జోగు రామన్న. బీసీ కుల వృత్తుల లబ్దిదారుల్ల ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరును చేర్చడం పై భగ్గుమన్నారు రామన్న. పారదర్శకత అంటే ఇదా.. ఇలానా ప్రభుత్వ పథకాల్లో అర్హులను ఎంపిక చేసిదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సాయంతో పాటు.. గృహలక్ష్మి , దళిత బంధు సాయాల్లోను అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని.. జిల్లాలో ఈ పరిస్థితి మారక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ను బద్నాం చేస్తే ఊరుకునేదే లేదన్నారు రామన్న. అధికారులు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక నిర్వహించాలని.. నిజమైన లబ్దిదారులకే అందాలని సూచించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లో అటు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే నే ఇలా వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనంగా మారింది. నిజంగానే సంక్షేమ పథకాలు పక్క దారి పడుతున్నాయడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే చాాలామంది ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..