AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Super 8 Schedule: సూపర్-8 మ్యాచ్‌ల ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే..?

India Super 8 matches T20 WC: పాకిస్తాన్ చివరగా సూపర్ 8 చేరిన టీంగా నిలిచింది. దీంతో సూపర్ 8 చేరిన 8 జట్ల షెడ్యూల్ కూడా విడుదలైంది. మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉన్నాయి. ఒక్కోో జట్టు 3 మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup Super 8 Schedule: సూపర్-8 మ్యాచ్‌ల ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే..?
T20 World Cup Super 8 Schedule
Venkata Chari
|

Updated on: Feb 19, 2026 | 7:13 AM

Share

T20 World Cup Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 దశకు అర్హత సాధించిన జట్ల జాబితా పూర్తిగా వెల్లడైంది. గ్రూప్-Aలో పాకిస్తాన్ చివరి మ్యాచ్‌లో నమీబియాను ఓడించిన తర్వాత సూపర్-8 లైనప్ ను ఖరారు చేసుకుంది. గ్రూప్-A నుంచి డిఫెండింగ్ చాంపియన్స్ అయిన భారత్, పాకిస్తాన్ అర్హత సాధించగా, గ్రూప్-B నుంచి శ్రీలంక, జింబాబ్వే అర్హత సాధించాయి. అలాగే, గ్రూప్-C నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ టాప్ టీమ్‌లుగా నిలిచాయి. గ్రూప్-D నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి. ముందుగానే అంచాన వేసినట్లే సూపర్ 8 చేరిన టీంలలో ఒక్క ఆస్ట్రేలియా జట్టు మాత్రమే లేదు. ఆ స్థానంలో జింబాబ్వే చేరింది. కాగా, ప్రస్తుతం అందరిచూపు ఈ జట్టుపైనే నిలిచింది. సూపర్ 8లో ఏ జట్టుకు షాక్ ఇవ్వనుందోనని మాట్లాడుకుంటున్నారు.

సూపర్-8 దశలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు) విభజించారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

సూపర్-8 గ్రూపులు..

గ్రూప్ 1: భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా

గ్రూప్ 2: పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్

గ్రూప్ 1 మ్యాచ్ షెడ్యూల్..

ఫిబ్రవరి 22: భారత్ vs దక్షిణాఫ్రికా – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 23: జింబాబ్వే vs వెస్టిండీస్ – వాంఖడే స్టేడియం, ముంబై (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (మ. 3 గంటలకు)

ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే – ఎం.ఏ. చిదంబరం స్టేడియం, చెన్నై (సా. 7 గంటలకు)

మార్చి 1: జింబాబ్వే vs దక్షిణాఫ్రికా – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ (మ. 3 గంటలకు)

మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (సా. 7 గంటలకు)

గ్రూప్ 2 మ్యాచ్ షెడ్యూల్..

ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ vs శ్రీలంక – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (మ. 3 గంటలకు)

ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 25: న్యూజిలాండ్ vs శ్రీలంక – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)

ఫిబ్రవరి 28: పాకిస్తాన్ vs శ్రీలంక – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (సా. 7 గంటలకు)

2028 టీ20 వరల్డ్ కప్‌కు ఆటోమేటిక్ అర్హత..

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగే తదుపరి వరల్డ్ కప్‌కు ఆటోమేటిక్‌గా అర్హత పొందుతాయి.

2028 టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు ఇప్పటికే నేరుగా అర్హత లభించింది. క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం, సూపర్-8కు వచ్చిన అన్ని జట్లు 2028 ఎడిషన్‌కు తమ స్థానం ఖరారు చేసుకున్నాయి.

మొత్తం 12 ఆటోమేటిక్ క్వాలిఫయర్ల జాబితాను మార్చి 9 నాటికి (ఫైనల్ తర్వాత రోజు) ఐసీసీ టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఉన్న టాప్-3 జట్లతో పూర్తి చేస్తారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ స్థానాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.

మిగిలిన 8 స్థానాలు ప్రాంతీయ క్వాలిఫికేషన్ మార్గం ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రతి ప్రాంతం నుంచి పోటీ సామర్థ్యాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు