AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన హీరో కృష్ణ.. ఆ సినిమా ఏంటో తెల్సా

తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా ఒక మైలురాయి. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం హిందీ రీమేక్‌ను సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. జితేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, కృష్ణకు నిర్మాతగా మంచి పేరు తెచ్చింది.

Chiranjeevi: చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన హీరో కృష్ణ.. ఆ సినిమా ఏంటో తెల్సా
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Feb 19, 2026 | 1:28 PM

Share

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్, టాలెంటెడ్ నటులు. వీరిద్దరూ తమ అద్భుతమైన నటనతో అనేక పాత్రల్లో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చిరంజీవి కంటే ముందే స్టార్‌గా అవతరించిన సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించారనే ఆసక్తికరమైన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కృష్ణ నిర్మించిన ఆ చిరంజీవి సినిమా ఒక సాధారణ చిత్రం కాదు. అది తెలుగు సినీ పరిశ్రమ గమనాన్నే మార్చేసిన ఒక చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. సంయుక్త మూవీస్ బ్యానర్‌పై కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఖైదీ సినిమాలో చిరంజీవి జైలు నుంచి తప్పించుకుని, స్మగ్లర్ల ముఠాపై పోరాటం చేసే ఖైదీ పాత్రలో నటించారు. ఖైదీ చిరంజీవి కెరీర్‌లోనే తొలి భారీ కమర్షియల్ హిట్‌గా నిలవడమే కాకుండా, ఆయనను తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని మెగాస్టార్‌గా నిలబెట్టింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారి, ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టింది.

ఈ సినిమా 1984లో హిందీలో రీమేక్ చేశారు. ఆ హిందీ రీమేక్ నిర్మాత ఎవరో కాదు, మన సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను కృష్ణ నిర్మించారు. ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ వెర్షన్‌లో, చిరంజీవి పోషించిన ప్రధాన పాత్రను జితేంద్ర పోషించారు. మాధవి హీరోయిన్‌గా నటించగా, సుమలత పాత్రను హేమమాలిని పోషించారు. రంగనాథ్ పాత్రలో శత్రుఘ్న సిన్హా నటించగా, రావు గోపాల్ రావు పోషించిన విలన్ పాత్రను ఖాదర్ ఖాన్ పోషించారు. ఖైదీ హిందీ రీమేక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలవడమే కాకుండా, నిర్మాతగా సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం కృష్ణ సినీ కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. తెలుగులో చిరంజీవికి స్టార్‌డమ్ తెచ్చిన సినిమా హిందీలో కూడా విజయం సాధించి, కృష్ణకు నిర్మాతగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

Follow Us
ఇల్లు కొనడానికి పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవడం ఎలా..?
ఇల్లు కొనడానికి పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవడం ఎలా..?
చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా?
చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా?
ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచవచ్చా? శాంతి, సంపద కోసం ఇలా చేయండి
ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచవచ్చా? శాంతి, సంపద కోసం ఇలా చేయండి
నా చెయ్యి పట్టుకుని రింగ్ లాగేశారు.. చున్నీ చిరిగిపోయింది..
నా చెయ్యి పట్టుకుని రింగ్ లాగేశారు.. చున్నీ చిరిగిపోయింది..
చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన హీరో కృష్ణ..
చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన హీరో కృష్ణ..
టీమిండియా సైలెంట్ హీరో.. ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం
టీమిండియా సైలెంట్ హీరో.. ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం
ఒక్క క్లిక్‌తో ఇంటికే పని మనిషి.. ఈ యాప్స్‌లో అన్నీ సేవలు
ఒక్క క్లిక్‌తో ఇంటికే పని మనిషి.. ఈ యాప్స్‌లో అన్నీ సేవలు
వాస్తు: మీరు పాత బట్టలతో నేల శుభ్రం చేస్తారా? అసలు విషయం తెలిస్తే
వాస్తు: మీరు పాత బట్టలతో నేల శుభ్రం చేస్తారా? అసలు విషయం తెలిస్తే
పెద్దపులి బోనులో నుంచి అడవిలోకి దూసుకెళ్తే.. ఎట్టా ఉంటదో తెలుసా?
పెద్దపులి బోనులో నుంచి అడవిలోకి దూసుకెళ్తే.. ఎట్టా ఉంటదో తెలుసా?
మందార మొక్క శక్తి తెలుసా? సరైన దిశలో నాటితే అదృష్టం మీ సొంతం!
మందార మొక్క శక్తి తెలుసా? సరైన దిశలో నాటితే అదృష్టం మీ సొంతం!