AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో అర్థరాత్రి అలజడి.. ఖాళీ స్థలంలో ఎగసిపడిన మంటలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్.. పోలీసుల ఎంట్రీ..

సాయి ఎన్‌క్లేవ్‌ జనంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ, అర్థరాత్రి వేళ ఓ మహిళను చంపేసి, ఆమె శరీరానికి నిప్పటించారు. స్కూటీపై బాడీని తీసుకువచ్చి ఓపెన్ ప్లాట్‌లో తగలబెట్టినట్లు సీసీటీవీ విజువల్స్‌లో కనిపిస్తోంది. అయితే, ఈ ఘటన జరిగిన అరగంట తరువాత స్థానికులు డెడ్ బాడీ మంటలను గుర్తించారు. స్థానికుడైన సూరజ్.. డ్యూటీ ముగిసిన తరువాత రూమ్‌కి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే పక్కనే ఏదో మండుతున్నట్లు గమనించాడు. అక్కడికి వచ్చి చూడగా మంటల్లో మహిళ మృతదేహం కనిపించింది. సూరజ్ వెంటనే తన అన్నకు..

Hyderabad: హైదరాబాద్‌లో అర్థరాత్రి అలజడి.. ఖాళీ స్థలంలో ఎగసిపడిన మంటలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్.. పోలీసుల ఎంట్రీ..
Shamshabad Murder Case
Shiva Prajapati
|

Updated on: Aug 11, 2023 | 8:44 AM

Share

రంగారెడ్డి, ఆగష్టు 11: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సాయి ఎన్‌క్లేవ్‌లో అర్దరాత్రి హత్య సంచలనం రేపింది. ఓ వివాహితను అత్యంత దారుణంగా చంపేశారు. ఆపై డెడ్ బాడీపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడో దుండగుడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడాన్ని చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక.. భయపడిపోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన సమాచారమిచ్చారు. హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కాలిపోతున్న డెడ్‌బాడీ చూసి షాకయ్యారు. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..

శంషాబాద్‌లో గల సాయి ఎన్‌క్లేవ్‌ జనంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ, అర్థరాత్రి వేళ ఓ మహిళను చంపేసి, ఆమె శరీరానికి నిప్పటించారు. స్కూటీపై బాడీని తీసుకువచ్చి ఓపెన్ ప్లాట్‌లో తగలబెట్టినట్లు సీసీటీవీ విజువల్స్‌లో కనిపిస్తోంది. అయితే, ఈ ఘటన జరిగిన అరగంట తరువాత స్థానికులు డెడ్ బాడీ మంటలను గుర్తించారు. స్థానికుడైన సూరజ్.. డ్యూటీ ముగిసిన తరువాత రూమ్‌కి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే పక్కనే ఏదో మండుతున్నట్లు గమనించాడు. అక్కడికి వచ్చి చూడగా మంటల్లో మహిళ మృతదేహం కనిపించింది. సూరజ్ వెంటనే తన అన్నకు కాల్ చేసి విషయం చెప్పాడు. అతను పోలీసులకు ఫోన్ కాల్ చేసి విషయాన్ని చెప్పాడు. దాంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీ, RGIA పోలీసులు వివరాలను సేకరించారు. కాగా, మంటల్లో కాలిపోయిన మహిళ కాళ్లకు ఊర్లలో పెద్దవాళ్లు పెట్టుకునేలాంటి పెద్ద మెట్టెలు ఉన్నట్లు గుర్తించారు. వీటి ఆధారంగా ఆమె వివాహిత అని తేల్చారు.

కాగా, సూరజ్ అన్న శ్రీను వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రాత్రి 1.04 గంటలకు సూరజ్ ఫోన్‌ చేయగానే తాను కూడా అక్కడికి వెళ్లి చూశానని శ్రీను చెప్పాడు. మహిళ తగలబడుతుండటం చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. సాధారణంగా అక్కడ ఎవరూ మహిళలు ఉండరని, తాము చూసే సరికి మహిళ బాడీ మొత్తం కాలిపోయిందని శ్రీను చెప్పాడు. అయితే అర్థరాత్రి జరిగిన దారుణంతో స్థానికులందరూ వణికిపోయారు. ఇళ్ల మధ్యకు డెడ్‌బాడీ తీసుకొచ్చి కాల్చేశారా? లేదంటే స్పాట్‌లోనే చంపేసి తగలబెట్టారా? సాయి ఎన్‌క్లేవ్‌ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారన్నది మిస్టరీగా మారింది. ఈ దారుణంలో సీసీ ఫుటేజ్‌ కీలకంగా మారింది. చిమ్మచీకట్లో చిన్నగా ఓ స్పార్క్‌ కనిపించింది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెకన్ల వ్యవధిలోనే స్పాట్‌నుంచి బైక్‌పై ఒకరు పారిపోయాడు. ఇదంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డయింది.

అర్ధరాత్రి 11.36 నిమిషాలకు డెడ్‌బాడీకి నిప్పు పెట్టినట్టు సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. స్థానికులు మాత్రం 12 గంటలు దాటాక గమనించారు. ఆ తర్వాత 1.04 నిమిషాలకు సమాచారం రావడంతో పోలీసులు స్పాట్‌కి వెళ్లారు. అప్పటికే డెడ్‌బాడీ కాలుతూనే ఉంది. డెడ్‌బాడీకి మంటలు అంటించి పారిపోయిన వ్యక్తి ఎవరు? స్థానికుడేనా లేదంటే మహిళను ఎక్కడైనా చంపి సాయి ఎన్‌క్లేవ్‌ ప్రాంతానికి తీసుకొచ్చి దారుణానికి తెగబడ్డాడా? ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? వివాహితను ఎక్కడ.. ఎలా చంపాడు? బైక్‌పై మృతదేహాన్ని ఎక్కడినుంచి తీసుకొచ్చాడు? సాయి ఎన్‌క్లేవ్‌నే స్పాట్‌గా ఎందుకు ఎంచుకున్నాడు? నిందితుడు ఒక్కడేనా? ఇంకెవరైనా సహకరించారా? డెడ్‌బాడీకి నిప్పు పెట్టాక నిందితుడు ఎక్కడికి పారిపోయాడు? ఆర్థిక విభేదాలా? వ్యక్తిగత కక్షలా? ఇంకేదైనా కారణమా? అత్యంత కిరాతకం వెనుక అసలు రీజనేంటి? అని అన్ని కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..