AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇలా చేస్తే చాలు.. పోయిన సెల్‌ఫోన్ వెంటనే మీ ఇంటికి వచ్చేస్తుంది

ఫోన్ దొంగలించిన, దొరికిన వ్యక్తులు అందులో కొత్త సిమ్ వేసి వినియోగించే ప్రయత్నం చేస్తారు అప్పటికే పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫోన్ పనిచేయదు. కానీ పోలీసులతోపాటు బాధితుడికి కొత్త సిమ్‌కి మెసేజ్ వస్తుంది ఆ ఫోన్లో వేసిన నెంబర్ డిస్‌ప్లే అవ్వడంతో పాటు.. ఫోన్ ఎక్కడుందో కూడా లొకేషన్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులు వారికి కాల్ చేసి తిరిగి ఇవ్వకుంటే చోరీ కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో వెంటనే ఫోన్‌ని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ విధానం ద్వారా గడిచిన మూడు నెలల్లోనే 7000 పైగా ఫోన్లను ట్రేస్ చేయగలిగారు పోలీసులు.

Telangana: ఇలా చేస్తే చాలు.. పోయిన సెల్‌ఫోన్ వెంటనే మీ ఇంటికి వచ్చేస్తుంది
Lost Cell Phones
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 11, 2023 | 8:39 AM

Share

తెలంగాణ, ఆగస్టు 11: సెల్‌ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అది దొరుకుతుందని నమ్మకం ఉండేది కాదు. ఇక అది చేతికి రానట్లే అని దాదాపు ఫిక్స్ అయ్యేవాళ్లు. కొంతమంది అయితే అసలు కంప్లైంట్ కూడా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే గంటల్లోనే మీ మొబైల్ చేతికి అందిస్తున్నారు పోలీసులు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సిఈఐఆర్) వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చాక గణనీయంగా రికవరీ శాతం పెరిగింది అంటున్నారు పోలీసులు. మొబైల్ పోయిన వెంటనే బాధితులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  మొబైల్ పోగొట్టుకున్న బాధితులు మొదట మీసేవ సెంటర్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత కంప్లైంట్ కాపీతో మొబైల్ స్టోర్‌కి వెళ్లి అదే నెంబర్ పై కొత్త సిమ్ తీసుకోవాలి. దీంతో అప్పుడు ఆటోమేటిక్ గానే పాత సిమ్ బ్లాక్ అయ్యి ఫోన్ మాత్రం పనిచేస్తుంది. ఆ తర్వాత సిఈఐఆర్ వెబ్ పోర్టల్‌లో బ్లాక్ లేదా ఫోన్ లాస్ట్ మొబైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లో అప్పటివరకు వినియోగించిన కొన్ని ఫోన్ నెంబర్లు, ఈఎంఐ నెంబర్లతో పాటు అక్కడ అడిగిన వివరాలను అందులో నమోదు చేయాలి. ఆ తర్వాత మీ కొత్త సిమ్‌కు రిక్వెస్ట్ ఐడి వస్తుంది. ఆ తర్వాత ఐడి ఆధారంగా కేసు స్టేటస్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సిఈఐఆర్ పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్‌ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు.

ఫోన్ దొంగలించిన, దొరికిన వ్యక్తులు అందులో కొత్త సిమ్ వేసి వినియోగించే ప్రయత్నం చేస్తారు అప్పటికే పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫోన్ పనిచేయదు. కానీ పోలీసులతోపాటు బాధితుడికి కొత్త సిమ్‌కి మెసేజ్ వస్తుంది ఆ ఫోన్లో వేసిన నెంబర్ డిస్‌ప్లే అవ్వడంతో పాటు.. ఫోన్ ఎక్కడుందో కూడా లొకేషన్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులు వారికి కాల్ చేసి తిరిగి ఇవ్వకుంటే చోరీ కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో వెంటనే ఫోన్‌ని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ విధానం ద్వారా గడిచిన మూడు నెలల్లోనే 7000 పైగా ఫోన్లను ట్రేస్ చేయగలిగారు పోలీసులు. రికవరీ పరంగా చూస్తే దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందంటున్నారు పోలీసులు. ఈ కొత్త విధానంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోనే రికవరీ శాతం గణనీయంగా పెరిగింది అంటున్నారు పోలీసులు.

అదన్నమాట సంగతి.. చెప్తే ప్రాపెస్ చాలా పెద్దదిగా అనిపించొచ్చు కానీ అంతా ఈజీనే. సో.. ఫోన్ పోగానే ఆశలు వదులుకోకుండా.. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి.. మీ విలువైన ఫోన్‌ను తిరిగి దక్కించుకోండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?