AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instant Maid Booking: క్లిక్ దూరంలో పని మనిషి.. యాప్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి.. కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి..

మెట్రో నగరాల్లో బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలామందికి తీరిక ఉండట లేదు. దీంతో సహాయకుల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారి కోసం అనేక యాప్స్ పుట్టుకొస్తాయి. ఈ యాప్స్‌లో బుక్ చేసుకుంటే ఇంటికే పని మనుషులు వచ్చేస్తున్నారు.

Instant Maid Booking: క్లిక్ దూరంలో పని మనిషి.. యాప్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి.. కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి..
Apps
Venkatrao Lella
|

Updated on: Feb 19, 2026 | 1:14 PM

Share

మీ ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి పని మినిషి కావాలా.. లేక పిండి పిసికి కలపడానికి ఓ వ్యక్తి కావాలా..? ఇల్లు శుభ్రం చేయడానికి మనిషి కావాలా..? ఇలా ఇంట్లోని ఏ చిన్న పనికైనా సరే మీరు యాప్ నుంచి పని మనిషిని బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకోగానే నిమిషాల్లోనే ఇంటికి వచ్చి పనులు చేస్తారు. మీరు కొంత మొత్తంలో వారికి చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం మెట్రో పాలిటన్ నగరాల్లో అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వీటిని వాడేవారు కూడా ఎక్కువైపోయారు. అంతేకాకుండా ఇలాంటి సేవలు అందించే కార్మికులు నెలకు రూ.30 వేలకు ఆదాయం పొందుతున్నారు.

ఒక క్లిక్ దూరంలో పని పనిషి

మనం ఏదైనా ఫుడ్ అవసరమైనా లేదా ఇంట్లో నిత్యావసర సరుకులు అవసరమైనా యాప్స్ నుంచి ఆర్డర్ పెడతాం. ఇదే తరహాలోనే సాధారణ ఇంటి పనుల కోసం మనుషులను బుక్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్‌లో ఒక క్లిక్‌తో నిమిషాల్లోనే మనుషులు మీ ఇంటికి వచ్చి సేవలు అందిస్తారు. కేవలం నామమాత్రపు రుసంతో సులభంగా ఇంట్లోని పనులు చేయించుకోవచ్చు. బట్టలు ఇస్త్రీ చేయడం, పిండి వేయడం, వెజిటెబుల్స్ కట్ చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, వాష్ రూమ్స్ క్లీనింగ్, పాత్రలు కడగడం,జుట్టు కత్తిరించడం లాంటి పనులన్నీ చేస్తారు. ఒక్కొ సేవలకు ఒక్కొలా రేట్లు ఉంటాయి. మీరు యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన సర్వీసును ఎంచుకుని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ చేసి టైమ‌కు సహాయకుడు వచ్చి సర్వీస్ అందిస్తాడు.

యాప్స్ ఇవే.. హైదరాబాద్‌లో కూడా..

హైదరాబాద్, బెంగళూరు, చెన్న, పూణె, ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో సహాయకులను బుక్ చేసుకునే యాప్స్ సేవలు అందిస్తు్న్నాయి. స్నాబిట్, బుక్ మైబై, మిడ్ క్లాప్, బ్రూమీస్, సులేఖ, హెల్పర్ 4యూ, అర్బన్ కంపెనీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోకి వెళ్లి బుకింగ్ చేసుకుంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తారు. తక్కువ ఖర్చుతో మీకు కావాల్సిన సర్వీసులు పొందవచ్చు, చిన్న, పెద్ద అవసరాలన్నింటికి ప్రజలు ఈ యాప్ ద్వారా సహాయకులను పిలుస్తున్నారు.  ప్రస్తుత పరిస్ధితుల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ బిజి లైఫ్‌లో ఇంట్లో పనులు చేసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో ఇంటి పనుల కోసం ఇలాంటి యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. కస్టమర్ల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు యాప్స్ నిర్వహకులు చెబుతున్నారు. రానన్న కాలంలో మరింత ప పెరిగే అవకాశముంది.

Follow Us