KCR Vision: సీఎం దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ భానుప్రసాద్

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు..

KCR Vision: సీఎం దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ భానుప్రసాద్
Koppula Eswar
Follow us

|

Updated on: Jul 08, 2021 | 10:41 PM

Whip Bhanu Prasad: పల్లె ప్రగతిని జయప్రదం చేయాలన్నారు ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ప్రజలందరి భాగస్వామ్యంతో పనిచేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని భాను ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇలాఉండగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో నీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత వానాకాలానికి సంబంధించి రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 1,654 మంది రైతులు మరణించగా.. బాధిత కుటుంబాలకు రూ.82.7 కోట్ల బీమా నిధులు అందజేసినట్లు పేర్కొన్నారు.

గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పెండింగ్‌ పనులను ఇప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద అదనంగా యూనిట్లు మంజూరు చేశామని, ఇందులో ముఖ్యంగా ల్యాండ్ డెవలప్‌మెంట్‌ స్కీం, పశువుల పెంపకం వంటి వాటిపై ప్రజాప్రతినిధులు అర్హులైన వారికి అవగాహన కల్పించి, అమలుకు సహకరించాలని కోరారు.

గురువారం జగిత్యాలలో స్థానిక మినీ పద్మనాయక కల్యాణ మండపంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి మంత్రి హాజరై దిశానిర్దేశం చేశారు.

Read also: Anakapalli flyover: అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలడంలో వెలుగు చూసిన సంచలన విషయాలు