Anakapalli flyover: అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలడంలో వెలుగు చూసిన సంచలన విషయాలు
అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనపై ఏయూ నిపుణుల కమిటీ నివేదికనిచ్చింది. దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ.. నిర్మాణంలో..
Anakapalli flyover: అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనపై ఏయూ నిపుణుల కమిటీ నివేదికనిచ్చింది. దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ.. నిర్మాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు అస్సలు పాటించలేదని తన నివేదికలో తేల్చి చెప్పింది. గడ్డర్లను కనెక్ట్ చేయడంలో ఏర్పడ్డ లోపమే.. ఫ్లై ఓవర్ కుప్పకూలడానికి కారణమని రిపోర్ట్ చేసింది. ఈ నివేదికను ఎన్ హెచ్ ఏ ఐకి పంపారు.
కాగా, జూలై 6- సాయంత్రం ఆరుగంటల సమయంలో అనకాపల్లిలో నిర్మిస్తున్న కొత్త ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లై ఓవర్ కూలే సయానికి కింద ఒక కారుంది. అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సరిగ్గా అదే టైంకి అటుగా వెళ్తున్న ట్యాంకర్ ఒకటి ఈ ప్రమాదంలో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ ఈ ట్యాంకర్ డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది.
దిలీప్ బిల్డ్ కాన్ అనే కాంట్రాక్ట్ కంపెనీ అధ్వర్యంలో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ దశలోనే కుప్పకూలడంతో స్థానికంగా అలజడి చెలరేగింది. ప్రారంభం కాకుండానే ఇద్దర్ని మింగేసిన ఈ నిర్మాణం భవిష్యత్తులో ఇంకెందర్ని బలి తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సైట్ ఇంజినీర్, కంపెనీ జనరల్ మేనేజర్ ను అరెస్టు చేశారు పోలీసులు.
ఈ ఘటనపై నిపుణుల కమిటీ విచారణ చేసి ఎన్ హెచ్ ఏ ఐకి నివేదికను ఇచ్చింది. ఏయూ ల్యాబ్ లో శాంపిల్స్ పరీక్ష చేసి.. గడ్డర్లను సరిగా కనెక్టు చేయక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు ప్రొఫెసర్లు. అన్ని గడ్డర్లను కలుపుతూ క్రాస్ గడ్డర్లను వేయాల్సి ఉందని తేల్చారు. తాత్కాలికంగా కనీస ఏర్పాట్లు చేయకుండా దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ నిర్లక్ష్యం వ్యవహరించిందని రిపోర్ట్ ఇచ్చారు.
Read also: Sajjala: షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదు : సజ్జల