AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది..

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు
Ap Weather Report
Venkata Narayana
|

Updated on: Jul 08, 2021 | 6:00 PM

Share

Andhra Pradesh Weather : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఏ మేరకు వర్షాలు కురవబోతున్నాయో తన నివేదికలో వెల్లడించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :

> ఈరోజు(గురువారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. > రేపు(శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. > ఎల్లుండి(శనివారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

> ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. > రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. > ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

>ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. > రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. > ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Read also: AP BJP: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కర్నూలు వేదికగా రంగంలోకి దిగబోతోన్న ఏపీ బీజేపీ