Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

ఈ వర్షాకాలంలో జోరు వానలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి.

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2021 | 7:29 AM

Heavy Rains in Andhra Pradesh: ఈ వర్షాకాలంలో జోరు వానలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి. రుతుపవనాల కదలికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. వచ్చే 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఈనెల 10న కోస్తా తీరంలో గంటకు 40 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునన్నారు. మరోవైపు, వాతావరణ హెచ్చరికలతో తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరిస్తున్నారు.

Read Also… Amma Vodi Laptops: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఉత్తర్వులు జారీ

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?