AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amma Vodi Laptops: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఉత్తర్వులు జారీ

Amma Vodi Laptops: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యకు సంబంధించిన విషయాల నుంచి వారికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు..

Amma Vodi Laptops: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఉత్తర్వులు జారీ
Amma Vodi Laptops
Subhash Goud
|

Updated on: Jul 09, 2021 | 7:18 AM

Share

Amma Vodi Laptops: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యకు సంబంధించిన విషయాల నుంచి వారికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది.

మూడేళ్ల వారెంటీ..

కాగా, ప్రభుత్వం పంపిణీ చేసే ల్యాప్‌టాప్‌లకు మూడేళ్ల వారెంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సాయానికి బదులు తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకునే విద్యార్థులకు వీటిని అందించనుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు సీఎం జగన్. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకానికి అర్హతకు తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాల్సి ఉంటుంది.

ఇవీ కూాాడా చదవండి

ఏపీ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు

Police Complaints Authority : తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యుల నియామకం..