L Ramana: సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ ఇక టీఆర్ఎస్ నేత కాబోతున్నారు...

L Ramana: సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ
Errabelli And L Ramana
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 08, 2021 | 10:55 PM

Ramana – Errabelli: టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ ఇక టీఆర్ఎస్ నేత కాబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారని ఎల్‌ రమణ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో గురువారం రాత్రి రమణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సీఎంతో సమావేశం అయ్యారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తో జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని రమణ చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై తమ మధ్య చర్చ జరిగిందని రమణ వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్‌ చెప్పారని, ఇందుకు తనతో కలిసి రావాలని కోరుతూ.. టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారన్నారు. ఇందుకు సానుకూలంగా నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు తెలిపారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రమణ అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానమన్నారు. చేనేత కుటుంబ నుంచి వచ్చిన రమణ టీఆర్‌ఎస్‌కు అవసరమన్నారు. చేనేత వర్గాలకు ప్రభుత్వం ఎంతో చేసిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు.

Read also: KCR Vision: సీఎం దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ భానుప్రసాద్