Hyderabad: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై పోలీసులకు ఎందుకు అంత ప్రేమ..!
హైదరాబాదులో ప్రస్తుతం హాట్ టాపిక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం.. ఇద్దరు పొలిటికల్ లీడర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పోలీసు కేసులకు దారితీసింది. ఫ్లెక్సీ వివాదం కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇద్దరిపైన ఇరువు వర్గాలపైన కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ..
హైదరాబాదులో ప్రస్తుతం హాట్ టాపిక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం.. ఇద్దరు పొలిటికల్ లీడర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పోలీసు కేసులకు దారితీసింది. ఫ్లెక్సీ వివాదం కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇద్దరిపైన ఇరువు వర్గాలపైన కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ.. ఎమ్మెల్యే పోద్బలంతో దాడి జరిగినప్పటికీ.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై మాత్రం కేసు నమోదు కాలేదు. మరి పోలీసులకు ఎమ్మెల్యే అంటే భయమా? లేక ఎమ్మెల్యే అంటే ప్రేమనా? అసలేం జరుగుతోంది?
ఎమ్మెల్యే మాగంటి సమక్షంలోనే దాడి..
బోనాల సందర్భంగా ఫ్లెక్సీ వివాదం తీవ్ర దుమారాన్నే లేపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫోటో లేకుండా టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫోటో ఉండడం అసలు వివాదానికి దారితీసింది. దీంతో ఫ్లెక్సీ పెట్టిన గణేష్ ఇంటికి డైరెక్ట్‌గా వెళ్లిన మాగంటి గోపీనాథ్ తన పిఏ తో పాటుగా అనుచరులతో ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తిపై తీవ్ర దుర్భాషలాడి నిలదీశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఎమ్మెల్యే పిఏ తో పాటుగా స్థానిక కార్పొరేటర్లు తన పైన దాడికి దిగినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గణేష్. అతని ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కేసులో ఎక్కడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరు లేదు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు బయపడ్డారా? అన్న చర్చ ప్రారంభమైంది. సీసీ కెమెరాలో స్పష్టంగా మాగంటి గోపీనాథ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఘటన స్థలంలో మాగంటి ఉండి, తన పీఏతో పాటుగా అనుచరులను రెచ్చగొట్టినట్టుగా ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కేవలం ఎమ్మెల్యే పీఏ పై మాత్రమే కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు రాజకీయ నాయకులకు భయపడ్డారన్న చర్చ ప్రారంభమైంది.
మాగంటిపై నో కేస్.. శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు..
ఒకవైపు మాగంటి గోపీనాథ్ పై కేసు పెట్టకుండానే చేతులు దులుపుకున్న మధుర నగర్ పోలీసులు, అదే నియోజకవర్గానికి చెందిన మరొక సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి పైన కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. దీంతో మధుర నగర్ పోలీసులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెప్పుచేతుల్లో ఉన్నట్టుగా పలువురు చెప్తున్నారు. ఎమ్మెల్యే కనుసైగాలతో శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గొడవలో ప్రత్యక్షంగా ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై కేసు నమోదు కాకపోవడం పోలీసుల వైఫల్యంగా స్పష్టంగా కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..