Hyderabad: భాగ్యనగరంలో సర్వేల సందడి.. సొంత సర్వేలు చేయించుకున్న నేతలు..
Hyderabad News: మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడా.. అందుబాటులో ఉంటున్నారా.. మీరు ఎ పార్టికి ఓటు వేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలడిగేవాళ్లు ఇప్పుడు హైదరాబాద్ ప్రతి గల్లీలో కనిపిస్తున్నారు. సర్వే సంస్థలకు చేతినిండా పనిదోరికింది నగరంలో.. మామూలుగా గ్రామీణ ప్రాంతాలు,
Hyderabad, July 19: మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడా.. అందుబాటులో ఉంటున్నారా.. మీరు ఎ పార్టికి ఓటు వేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలడిగేవాళ్లు ఇప్పుడు హైదరాబాద్ ప్రతి గల్లీలో కనిపిస్తున్నారు. సర్వే సంస్థలకు చేతినిండా పనిదోరికింది నగరంలో.. మామూలుగా గ్రామీణ ప్రాంతాలు, సెమి అర్బన్, అర్బన్ ఎరియాల్లో కొంత జనం నాడి తెలిసిపోతుంది. బహిరంగంగా కూడా ప్రజలు మాట్లాడుకుంటారు. మెట్రోసిటిలో మాత్రం అంత ఈజీగా టాక్ బయటకు రాదు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో గ్రేటర్ ఎమ్మెల్యేలలో టెన్షన్ మెదలైంది. అసలు మా పనితనంపై ప్రజలు ఎమనుకుంటున్నారనే బెంగ పట్టుకుంది. అధినేత కేసీఅర్ సర్వేలు చేయిస్తున్నా అవి వారికి అందజేయడంలేదు. దీంతో సొంత సర్వేలు చేయించుకుంటున్నారు ఎమ్మెల్యేలు.
ఢిల్లీ, బెంగుళూరు నుంచి వచ్చిన సర్వే ఎజెంట్లు హైదరాబాద్‌లో పెద్దఎత్తున పనిచేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందుకేసి పార్టీల పరంగా, ప్రత్యర్థుల జనాదరన మీద కూడా సర్వేలు చేయిస్తున్నారు. అధికార పార్టిలో గ్రాఫ్ పడిపోతే.. ప్రతిపక్షపార్టిలో పోటిచేసి గెలుపోందే అవకాశం ఉందా? అని కూడా చెక్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక కొన్ని సర్వే సంస్థలు కేవలం టెలి కాలింగ్ ద్వారా సర్వే నిర్వహిస్తుంది.
కులాల వారిగా, మతాల వారిగా, బస్తిలు, అపార్ట్‌మెంట్లు ఇలా సెంగ్నెంట్ల ప్రకారం సర్వేలు చేయిస్తున్నారు. ఏ వర్గం తమ పట్ల వ్యతిరేఖంగా ఉంది. ఎవరికి అనుకూలంగా ఉన్నారనే విషయం తెలుసుకుంటున్నారు. ఈ సర్వేల కోసం గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..