Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో పార్కింగ్ తంటాలు.. స్థలాలు లేక రోడ్ల పైనే వాహనాలు

హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో అందంగా ఇల్లులు కడుతున్నారు. లిఫ్ట్‎తో సహా అన్ని హంగులూ ఉంటాయి. కానీ పార్కింగ్‎కు మాత్రం ప్లేస్ ఉండదు. పార్కింగ్ కు కేటాయించే స్థలం ఉంటే.. మరో రెండు మూడు పోర్షన్స్ వస్తాయని భావిస్తున్నారు ఓనర్స్.

Hyderabad: నగరంలో పార్కింగ్ తంటాలు.. స్థలాలు లేక రోడ్ల పైనే వాహనాలు
Cars
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Aravind B

Updated on: Jul 19, 2023 | 10:55 AM

హైదరాబాద్‌ జులై 19:  హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో అందంగా ఇల్లులు కడుతున్నారు. లిఫ్ట్‎తో సహా అన్ని హంగులూ ఉంటాయి. కానీ పార్కింగ్‎కు మాత్రం ప్లేస్ ఉండదు. పార్కింగ్ కు కేటాయించే స్థలం ఉంటే.. మరో రెండు మూడు పోర్షన్స్ వస్తాయని భావిస్తున్నారు ఓనర్స్. ఇంటిముందు వెహికల్స్ ను పార్క్ చేయడంతో.. ఇబ్బంది పడుతున్నారు సిటీ పబ్లిక్. పార్కింగ్ కు స్థలం కేటాయించుకుండా.. ఇల్లు కడుతుంటే.. మరి జీహెచ్ఎంసీ ఏం చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిటీలో ఇల్లు అద్దెకు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. కానీ.. ఆ ఇంటికి పార్కింగ్ మాత్రం అడగొద్దు. టూ వీలర్, ఫోర్ వీలర్.. ఏదైనా ఇంటిముందు పార్క్ చేయాల్సిందే. సిటీలో 60 శాతం పైగా ఇల్లులు ఇలాగే ఉన్నాయి. ఇల్లు మాత్రమే అద్దెకి ఇస్తాం.. కానీ పార్కింగ్ కు ప్లేస్ మాత్రం అడగొద్దు అని తేల్చి చెబుతున్నారు ఓనర్స్. ఇంటిముందు పార్క్ చేస్కోండి.. మేమూ అక్కడే చేస్తాం.. అని సమాధానం చెబుతున్నారు.

Cars 2

ప్రస్తుతం ఉండేది అద్దె ఇల్లయినా.. ఏదొక సొంత వెహికల్ కంపల్సరీగా ఉంటుంది. కొందరికైతే.. ఫోర్ వీలర్ కూడా ఉంటుంది. దీంతో ఎన్ని పోర్షన్స్ ఉంటే అన్ని వెహికల్స్ ఇంటి ముందే పార్కింగ్ చేస్తున్నారు. పార్కింగ్ ఉన్న ఇల్లు కావాలని తిరిగితే.. బండి టైర్ అరగాలే కానీ.. ఇల్లు దొరకదు. అపార్టమెంట్స్‎లో తప్ప పార్కింగ్ కు ఎక్కడా ప్లేస్ ఉండడం లేదు. దీంతో.. అపార్టమెంట్స్‎లో ఉండాలంటే కాస్తంత రెంట్ ఎక్కువగా ఉండడంతో సగటు మధ్య తరగతివారు పార్కింగ్ లేకపోయినా ఏదొక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సిటీలో గల్లీ, కాలనీ ఏదైనా.. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగానే ఉంటాయి. పాష్ ఏరియాలలో తప్ప.. మధ్య, దిగువ తరగతి వారుండే ఏరియాలలో ఇదే సీన్ కనిపిస్తుంది. అరకొరగా ఉన్న జాగాలో ఇల్లు కడుతూ.. లిమిట్‎కు మించి ఫ్లోర్స్ కడుతున్నారు. కానీ వెహికల్స్ పార్క్ చేయడానికి మాత్రం ప్లేస్ కేటాయించడం లేదు. ఒక గల్లీలో అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఇళ్ల ముందు పార్కింగ్ చేస్తే.. కనీసం కారు వెళ్లడానికి కూడా కష్టంగా పరిస్ధితులు ఉన్నాయి. అసలే ఇరుకు సందులు అంటే.. సగానికి పైగా స్థలాన్ని వాహనాలు ఆక్రమిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

Cars 3

ఇంటి ఓనర్స్ పార్కింగ్ వెసులుబాటు కల్పిచకపోవడంతో.. నానా అవస్థలు పడుతున్నామంటున్నారు కిరాయిదారులు. ఇంటి ముందు పార్కింగ్ చేయడం వల్ల.. సెక్యూరిటీ కష్టంగా ఉందంటున్నారు. పైగా వెహికల్ పోతున్నప్పుడు దేనికైనా తగిలినా లేనిపోని లొల్లి అవుతుందంటున్నారు. వారి స్థలంలో ఇల్లులు కట్టకుండా.. రోడ్లను కొంతవరకూ ఆక్రమించి ఇళ్లను నిర్మించడంతో పాటు ఆ మిగిలిన రోడ్డు మీద వెహికల్స్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీ-ప్లస్ 2 అని ఇంటి నిర్మాణం స్టార్ట్ చేస్తారు. తరువాత మరో రెండు మూడు ప్లోర్లు వేస్తున్నారు. దీంతోపార్కింగ్ సమస్య మరీ తీవ్రవమవుతుంది. ఇక కొందరు తెలివిగా.. ఏదో మూడు నాలుగు టు వీలర్స్ పెట్టుకునేలా స్థలం కేటాయిస్తున్నారు. ఇక మిగతా వెహికల్స్ అన్నీ.. రోడ్ మీదే పార్క్ చేస్తున్నారు.

ప్రతి గల్లీలో ఉండే సమస్యే ఇది. జీహెచ్ఎంసీ దృష్టికి కొందరు సిటీ పబ్లిక్ తరచూ తీస్కువెళతునే ఉంటారు. కానీ.. చర్యలు తీసుకోవాల్సిన బల్దియా మాత్రం చోద్యం చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. బల్దియా రూల్స్ ప్రకారం.. ప్రతి ఇంటి కింద పార్కింగ్ కు స్థలం కేటాయించాలి. అసలు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు పార్కింగ్ కు స్థలం కేటాయించాలని ఉంటుంది. కానీ.. రూల్స్ ను ఎవరూ పాటించడంలేదు. పోనీ బల్దియా యాక్షన్ తీస్కుంటుందా అంటే అదీ లేదు. కనీసం కొత్తగా కడుతున్న ఇళ్లకు కూడా పార్కింగ్ ప్లేస్ వదలడం లేదు ఓనర్స్. మధ్యాహ్నం పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. ఉదయం, సాయంత్రం ప్రతి గల్లీలో పార్కింగ్ సమస్య కనిపిస్తుంది. గల్లీలలో ఫోర్ వీలర్ వెళ్లాలంటే.. టు వెహికల్స్ ను జరుపుకుంటూ వెళ్లాల్సివస్తుందని ప్రజలు వాపోతున్నారు . ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..