Telangana: లైసెన్స్ లేకున్నా పర్లేదు.. నేను చూసుకుంటా.. చికోటి ప్రవీణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
చికోటి ప్రవీణ్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చికోటి కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు కూడా సీఆర్‌ఫీఎఫ్‌లో పనిచేసిన అనుభవం ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో తేల్చారు పోలీసులు.

చికోటి ప్రవీణ్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చికోటి కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు కూడా సీఆర్‌ఫీఎఫ్‌లో పనిచేసిన అనుభవం ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో తేల్చారు పోలీసులు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్‌ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిసిందని వెల్లడించారు.
చికోటి ఎక్కడికి వెళ్ళినా ఆయుధాలతోనే వెళ్తున్న సెక్యూరిటీ తమ దగ్గర లేని లైసెన్స్‌లను ఫేక్ గా తయారు చేసి తిరిగినట్టు పోలీసులు తేల్చారు. అందుకే పోలీసులు చికోటి ప్రవీణ్‌ని A1 గా చేర్చారు. రిమాండ్ రిపోర్టును బట్టి అసలు గన్ లైసెన్స్‌లు, ప్రైవేటు సెక్యూరిటీ వ్యవహారాల్లో చికోటిని అసలు నిందితుడిగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కేసు నమోదు తర్వాత పారిపోయిన చికోటి ప్రవీణ్‌ను పట్టుకునే ప్రయత్నం పోలీస్ శాఖ చేసింది. అయితే ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..