AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏం నాయనా గన్ లైసెన్స్ కావాలా.. అయితే కంప్యూటర్స్ బాగు చేయించు.. అడ్డంగా బుక్కైన సీఐ..

రవి అనే వ్యక్తికి గన్ లైసెన్స్ కావాలి.. అది కూడా రెన్యూవల్ మాత్రమే చేయించాలి. ప్రొసీజర్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు రవి.అక్కడున్న సిబ్బందిని సీఐ ఉన్నాడా అని అడిగాడు.హా వెళ్ళండి సర్ అంటూ సీఐ ఛాంబర్ కు రవి నీ పంపారు.. లోపలికి వెళ్ళగానే సీఐ శ్రవణ్ ను కలిశాడు రవి. సార్ నాకు గన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఐపోయింది

Hyderabad: ఏం నాయనా గన్ లైసెన్స్ కావాలా.. అయితే కంప్యూటర్స్ బాగు చేయించు.. అడ్డంగా బుక్కైన సీఐ..
Telangana Police
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 19, 2023 | 10:06 AM

Share

రవి అనే వ్యక్తికి గన్ లైసెన్స్ కావాలి.. అది కూడా రెన్యూవల్ మాత్రమే చేయించాలి. ప్రొసీజర్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు రవి.అక్కడున్న సిబ్బందిని సీఐ ఉన్నాడా అని అడిగాడు.హా వెళ్ళండి సర్ అంటూ సీఐ ఛాంబర్ కు రవి నీ పంపారు.. లోపలికి వెళ్ళగానే సీఐ శ్రవణ్ ను కలిశాడు రవి. సార్ నాకు గన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఐపోయింది రినివల్ చేయించాలి కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు రవి. దానిదేముంది చేసేద్దాం అంటూ ఒకే చెప్పాడు సీఐ.. నీకు గన్ లైసెన్స్ రీనివల్ చేయిస్తా కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి అన్నాడు సీఐ.. అతని మాటలతో అవ్వాక్కైయాడు రవి .. సీఐ ఎంత అడుగుతాడో అని భయపడ్డాడు. సీఐ అడిగిన ఫేవర్ చూసి కొద్ది క్షణాల పాటు ఎం మాట్లాడలేదు రవి.

నా ఆఫిస్‌లో కంప్యూటర్లు కరాబ్ అయ్యాయి..

నువ్వు అడిగినట్టు నేను నీ గన్ లైసెన్స్ రినివల్ కు సహాయం చేస్తాను కానీ నా ఆఫిస్ లో కంప్యూటర్స్ అన్ని పాడయ్యునాయి వాటిని బాగు చేయించు అప్పుడు నీకు గన్ లైసెన్స్ రినివల్ చేయిస్తా అన్నాడు సీఐ. ఆయన చెప్పిన మాటలకు సరేనని చెబుతూనే సీఐ మాట్లాడింది అంతా ఫోన్‌లో రికార్డ్ చేశాడు రవి. వెంటనే ఏసీబీ ఆఫీసర్‌కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈ తతంగం అంతా హైదరాబాద్ శివార్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌‌లో చోటు చేసుకుంది.

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

రవి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. మంగళవారం ఉదయం నుండి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. సిఐ శ్రవణ్ మొబైల్ తో పాటు లాప్టాప్ ను వెరిఫై చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సీఐ శ్రవణ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను పరిశీలిస్తున్నారు ఏసీబీ టీమ్స్.. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!