Telangana: కాకరేపుతోన్న తండ్రీ బిడ్డల ల్యాండ్ ఫైట్.. మరోసారి కంటతడిపెట్టిన ఎమ్మెల్యే..
Jangaon politics: జనగామలో తండ్రీ బిడ్డల ల్యాండ్ ఫైట్ కాకరేపుతోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఆయన కూతురు భవానీ మధ్య భూవివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ భూ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Jangaon politics: జనగామలో తండ్రీ బిడ్డల ల్యాండ్ ఫైట్ కాకరేపుతోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఆయన కూతురు భవానీ మధ్య భూవివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ భూ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కుట్రలో తన కుమార్తె తుల్జాభవానిరెడ్డి పావుగా మారిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి కంటతడి పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. కూతురి రచ్చ చూసి ఇప్పటికే పలుమార్లు కన్నీళ్ల పర్యంతమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి కంటతడి పెట్టారు. ప్రజలు ఛీకొట్టిన నాయకులు తన బిడ్డను రోడ్డుపైకి తెచ్చారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేనోళ్లే తన బిడ్డను రోడ్డుపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బిడ్డను తనపైకి ఉసిగొలిపి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన కూతురిని పావుగా వాడుకొని రాజకీయ ప్రత్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తనపై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆరోపించారు.
కొంతకాలంగా జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి మధ్య నడుస్తున్న ఆస్తి వివాదం తార స్థాయికి చేరిన విషయం తెలసిందే.. ఇది కాస్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఆ తర్వాత అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారంటూ కుమార్తె తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డిలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముత్తిరెడ్డి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను శుక్రవారం ఆదేశించడంతోపాటు.. ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
