AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఖమ్మం గడ్డపై ‘తెలంగాణ జనగర్జన సభ’.. హాజరుకానున్న రాహుల్ గాంధీ..

Telangana Congress Jana Garjana Sabha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది.. దీంతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఓ వైపు అధికారపార్టీ బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ దుకూడు పెంచాయి.

Telangana Congress: ఖమ్మం గడ్డపై ‘తెలంగాణ జనగర్జన సభ’.. హాజరుకానున్న రాహుల్ గాంధీ..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Jul 02, 2023 | 6:56 AM

Share

Telangana Congress Jana Garjana Sabha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది.. దీంతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఓ వైపు అధికారపార్టీ బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ దుకూడు పెంచాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఇవాళ.. ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక.. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ రోజే ముగియనున్న నేపథ్యంలో వంద ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతోపాటు.. మేనిఫెస్టోలోని కీలక విషయాలను ప్రస్తావించనున్నాట్లు పేర్కొంటున్నారు.

అయితే, పొంగులేటి, జూపల్లితోపాటు.. ఈ కాంగ్రెస్ జన గర్జణ సభలో మరికొంతమంది నాయకులు కూడా చేరనున్నారు. ఈరోజే సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగియనున్న నేపథ్యంలో.. అదే వేదికపై రాహుల్‌ భట్టిని ఘనంగా సన్మానించనున్నారు.

ఖమ్మం సభకోసం.. రాహుల్ ముందుగా విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత ఖమ్మం రానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..