AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chikoti Praveen: చికోటి చీకటి వ్యాపారం.. లక్షల్లో తారలకు పారితోషకాలు.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయించమని టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్

కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ లిస్ట్‌లో ఉన్న బడాబాబులు, పొలిటీషియన్స్‌ పేర్లు బయటపడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ తారలతోనూ కోట్లలో డీలింగ్ చేశాడు చికోటి.

Chikoti Praveen: చికోటి చీకటి వ్యాపారం.. లక్షల్లో తారలకు పారితోషకాలు.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయించమని టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్
Chikoti Praveen
Surya Kala
|

Updated on: Jul 29, 2022 | 7:58 AM

Share

Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌ కుమార్.. క్యాసినో దందాలో కింగ్‌ పిన్. పత్తాలాటతో కోట్ల రూపాయల హవాలా దందాపై ఈడీ దూకుడు పెంచింది. నేపాల్‌లో క్యాసినో ఈవెంట్‌కి పెద్ద సంఖ్యలో పంటర్లు వచ్చేలా టాలీవుడ్ , బాలీవుడ్ నుంచి హీరోయిన్స్‌తో గ్రాండ్‌గా ప్రమోషన్ చేశాడు ప్రవీణ్‌.  అమిషా పటేల్‌, ఈషా రెబ్బా, ముమైత్‌ ఖాన్‌, డింపుల్ హయతిలకు కూడా నోటీసులిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చికోటి కస్టమర్ల లిస్ట్‌ అంతకుమించి అనేలా ఉంది. ఆ లిస్ట్‌ టీవీ9 చేతికి చిక్కింది. చికోటి ప్రవీణ్‌కి రెగ్యులర్‌ కస్టమర్లు 500మంది దాకా ఉన్నారు. అందులో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కువగా తెలుగురాష్ట్రాలకు చెందిన బడా బడా నేతలే ఉన్నారు. క్యాసినో ఈవెంట్‌కి అడ్వాన్స్‌ కింద ఐదు లక్షలు చెల్లిస్తారట. విదేశాల్లో క్యాసినో పేరుతో కోట్లకు పడగలెత్తిన చికోటిపై ఈడీ అధికారుల దాడితో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ షాక్ ఇస్తున్నాయి.

చికోటి ప్రవీణ్‌ చీకటి వ్యాపారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు తనకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదల్లేదు చికోటి. సోషల్ మీడియా దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ తన ప్రచారానికి వాడుకున్నాడు. సినీ తారలతో సెల్ఫీ వీడియోలు చేయించి మరీ క్యాసినోకు ఆహ్వానించేవాడు. మేం కూడా క్యాసినోకి వస్తున్నామంటూ సినీ తారలతో ప్రచారం చేయించేవాడు. అందుకు గాను వాళ్లకి లక్షల్లో పారితోషికాలు ముట్టజెప్పాడు. ఆ వివరాలను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. దాని ప్రకారం చికోటి నుంచి మల్లికా షెరావత్‌‌కు కోటి.. ఈషా రెబ్బాకు 40 లక్షలు.. గణేశ్‌ ఆచార్యకు 20 లక్షలు.. ముమైత్‌ ఖాన్‌‌కు 15 లక్షలు.. అమీషా పటేల్‌‌కు 80 లక్షలు.. డింపుల్‌ హయాతీకి 40లక్షలు.. అలాగే గోవిందాకు 50 లక్షలు చెల్లింపులు చేశారు.

ఇవి కూడా చదవండి

ఏపీలోనూ క్యాసినో రాజకీయం గిర్రున తిరుగుతోంది. అప్పుడెప్పుడో జరిగిన గుడివాడ క్యాసినో చుట్టూ పొలిటికల్ హీట్ మొదలైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చికోటి సన్నిహితుడేది వర్ల రామయ్య కామెంట్. గుడివాడ క్యాసినోలో 180 కోట్లు చేతులు మారాయనీ.. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయన్నారు. ఇటు ఎమ్మెల్యే కొడాలి నాని నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను అరెస్ట్‌ చేయించాలని సవాల్ విసిరారు. చికోటి క్యాసినో కథా చిత్రమ్‌లో మరెన్నో సంచనాలు ఖాయమనే సంకేతాలు ఇస్తోంది ఈడీ విచారణ. చికోటి ప్రవీణ్‌ ఎపిసోడ్‌లో తెరపైకి రాబోయే కొత్త కోణాలేంటి? చికోటి, అతని అనుచరుడు మాధవ రెడ్డి విచారణలో ఏం తేలబోతోంది. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us