AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో ప్రమాదం.. ఐదుగురు మృతి..

Telangana: పాలమూరు-రంగారెడ్డి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాకేజీ వన్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు..

Telangana: పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో ప్రమాదం.. ఐదుగురు మృతి..
Palamur
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2022 | 8:30 AM

Share

Telangana: పాలమూరు-రంగారెడ్డి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాకేజీ వన్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపోయింది. దాంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారి మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. కాగా, ప్రమాదంపై విచారణకు ఆదేశించారు అధికారులు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us