AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మద్యం మత్తులో తాగుబోతులు వీరంగం.. గొడవ వద్దు అన్నందుకు హోటల్ సామాగ్రి ధ్వసం

కూకట్ పల్లిలోని పాపారాయుడు నగర్ లోని కె.వి.టిఫిన్స్ సెంటర్ ఎదురుగా గురువారం రాత్రి సతీష్ అనే వ్యక్తితో ఐదుగురు తాగుబోతులు గొడవకు దిగారు.

Hyderabad: మద్యం మత్తులో తాగుబోతులు వీరంగం.. గొడవ వద్దు అన్నందుకు హోటల్ సామాగ్రి ధ్వసం
Drunk Hulchul In Hyderabad
Surya Kala
|

Updated on: Jul 29, 2022 | 6:56 AM

Share

Hyderabad: ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా నగరంలో మందుబాబుల తీరు మారడం లేదు. రోజులో ఎక్కడోచోట తాగిన మత్తులో హల్ చల్ చేస్తూనే ఉంటున్నారు. తాజాగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ (Kukatpally Police Station) పరిధిలో గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టిచారు. తమ హోటల్ లో గొడవ పడకూడదు అని చెప్పిన కారణానికి హోటల్ సామాగ్రి ధ్వంసం చేసి హోటల్ సిబ్బంది పై దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాపారాయుడు నగర్ లోని కె.వి.టిఫిన్స్ సెంటర్ ఎదురుగా గురువారం రాత్రి సతీష్ అనే వ్యక్తితో ఐదుగురు తాగుబోతులు గొడవకు దిగారు.

గొడవ పడుతూ టిఫిన్స్ సెంటర్ లోకి ప్రవేశించటంతో, వారిని లోనికి రాకూడదని, టిఫిన్ సెంటర్ నుండి బయటకు వెళ్లాలంటూ కోరిన హోటల్ యజమాని కృష్ణ కోరాడు. తమను బయటకు వెళ్ళమన్నాడన్న కోపంతో, మద్యం మత్తులో హోటల్ లోని సామాగ్రిని ధ్వసం చేసారు. నిలువరించేందుకు ప్రయత్నించిన హోటల్ యజమాని కృష్ణ, సిబ్బంది ముగ్గురి పై దాడి చేశారు. ఎదురు తిరిగిన హోటల్ సిబ్బంది పోలీసులకి సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల రాకను గమనించిన మందుబాబులలో నలుగురు పారిపోగా, కిషన్ అనే ఒక్కడు పోలీసుల చేతికి చిక్కాడు. హోటల్ లోని సీసి కెమెరాలలో మొత్తం రికార్డు అవ్వగా, హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో, కిషన్ ను పోలీస్ స్టేషనుకు తరలించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us