Telangana: స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు!

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో గత సోమవారం రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, పోలీస్‌ బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు నేలరాలారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు దీనిని అభివర్ణించారు. దాదాపు 29 మంది మృతిచెందగా వారిలో మావోయిస్ట్‌ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్‌ అలియర్‌ శంకర్‌రావు, ఆయన భార్య సుమన అలియాస్‌ రజిత..

Telangana: స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు!
Maoist Shankar Rao And Rajitha
Follow us

|

Updated on: Apr 19, 2024 | 11:35 AM

భూపాలపల్లి, ఏప్రిల్ 19: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో గత సోమవారం రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, పోలీస్‌ బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు నేలరాలారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు దీనిని అభివర్ణించారు. దాదాపు 29 మంది మృతిచెందగా వారిలో మావోయిస్ట్‌ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్‌ అలియర్‌ శంకర్‌రావు, ఆయన భార్య సుమన అలియాస్‌ రజిత కూడా ఉన్నారు. వీరి మృతదేహాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. వారిద్దరి అంత్యక్రియలను ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు వారి బంధువులు తెలిపారు.

ఏప్రిల్‌16న బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన భీరక కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని అంచనా. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టుల మృత దేహాలు లభ్యంకాగా.. వీరిలో 11 మంది గుర్తింపు వెల్లడించారు. తెలంగాణకు చెందిన శంకర్‌రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి సమాయత్తమవుతున్నట్లు పక్కా సమాచారం అందింది. ఈ ప్లీనరీకి సీపీఐ (మావోయిస్టు) బస్తర్‌ డివిజన్‌ నేతలు శంకర్‌, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు పోలీసులకు తెలిసింది. బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌జీ, రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టారు.

మరోవైపు బీనగుండా-కొరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో జవాన్లపైకి ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారు. ఘటనాస్థలంలో మృతదేహాలతోపాటుగా భారీయెత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లో ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దాదాపు 79 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్‌ 2 బీజాపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ