Lakshmi Narayana: స్టూడెంట్స్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కారణమేంటంటే?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీరియస్‌ అయ్యారు. నేతాజీ జయంతి వేడుకల్లో ఓ విద్యార్ధిని ప్రసంగించేటప్పుడు..కొందరు పోకిరీలు చేసిన కామెంట్లతో లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. న్యూసెన్స్ చేసిన పోకిరీలను తిట్లతో ఉతికి ఆరేశారు.

Lakshmi Narayana: స్టూడెంట్స్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కారణమేంటంటే?
Cbi Ex Jd Lakshmi Narayana
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2023 | 7:15 AM

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీరియస్‌ అయ్యారు. నేతాజీ జయంతి వేడుకల్లో ఓ విద్యార్ధిని ప్రసంగించేటప్పుడు..కొందరు పోకిరీలు చేసిన కామెంట్లతో లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. న్యూసెన్స్ చేసిన పోకిరీలను తిట్లతో ఉతికి ఆరేశారు. ఎప్పుడూ..కూల్‌గా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో భాగంగా వేదికపై ఓ విద్యార్థిని దేశం గురించి..దేశ సమగ్రత గురించి ప్రసంగిస్తున్న సమయంలో..విద్యార్థుల్లో ఉన్న కొందరు కామెంట్లు చేస్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రసంగానికి అడ్డం తగులుతూ పిల్లికూతలు కూశారు. దీంతో స్టేజీపైన ఉన్న లక్ష్మీనారాయణ సహనం కోల్పోయారు. కోపంతో ఊగిపోయారు. కామెంట్స్ చేసిన పోకిరీలపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తిట్లతో అక్కడే ఉతికి ఆరేశారు. వారిని బయటకు పంపించాలని నిర్వాహకులు చెప్పారు.

జేడీ ఆగ్రహంతో అంతా సైలెంట్‌ అయ్యిపోయారు. ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే.. పిల్లికూతలు, కుక్క కూతలు కూస్తున్నారు వారికి బయటకు తోసి పడేయ్యండని సీరియస్‌ అయ్యారు. ఇలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టి దేశం ఇలా ఉంది. అప్పటి నుంచి గమనిస్తున్నా. అమ్మాయిల వెనుక లైన్‌లో కూర్చున్న వారిలోనే ఆ వెదవలు ఉన్నారు. విద్యార్థుల్లా ఉన్నారా మీరు? ఏం సాధించారని గర్వపడుతున్నారు. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీనారాయణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?