AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam Politics: ఖమ్మంలో పిక్స్‌కు చేరిన పొలిటికల్‌ వార్‌.. రాబోయే యుద్ధానికి సిద్ధమంటూ పొంగులేటి ప్రకటన..

ఇన్ని రోజులు అవమానాలు భరించాం.. ఇక సహించేది లేదంటూ ఉప్పొంగే కెరటంలా ఎగిసిపడ్డారు పొంగులేటి. అసలు ఇక్కడ నీకేంటి పనంటూ ఘాటుగా సమాధానం వచ్చింది ఎమ్మెల్యే హరిప్రియ నుంచి. వీళ్లిద్దరి మాటలతో ఖమ్మం రాజకీయాల్లో కాక రేగుతోంది.

Khammam Politics: ఖమ్మంలో పిక్స్‌కు చేరిన పొలిటికల్‌ వార్‌.. రాబోయే యుద్ధానికి సిద్ధమంటూ పొంగులేటి ప్రకటన..
Ponguleti Srinivas Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2023 | 7:48 AM

Share

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం రంజుగా మారుతోంది. BRS అసమ్మతినేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందులో నిర్వహించిన మీటింగ్‌లోనూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. BRS ప్రభుత్వం ఇంకా రెండు మూడు నెలులు మాత్రమే ఉంటుందన్నారు..తమ అనుచరులను ఇబ్బంది పెడుతున్న వాళ్లు.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇల్లందు ఆత్మీయ సమ్మేళనానికి పొంగులేటి అనుచరులు భారీగానే హాజరయ్యారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా, డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య పాల్గొన్నారు. రాబోయే యుద్ధానికి సిద్ధమని.. పొంగులేటితోనే తమ ప్రయాణమని ప్రకటించారు.

పొంగులేటి ఆత్మీయసమ్మేళనానికి పోటీగా.. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ కూడా యాక్షన్‌లోకి దిగారు. ఆమె కూడా అదే ఇల్లందులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. పొంగులేటితోపాటు.. కోరం కనకయ్య టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

మొత్తానికి ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌ హైవోల్టేజ్‌ హీట్‌ను రాజేస్తున్నాయి.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దారెటు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ మారడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా.. ఎప్పుడు, ఏ పార్టీలోకి వెళ్తారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఈనెల 18నే కాషాయకండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అటు కాంగ్రెస్‌ కూడా ఆహ్వానిస్తుండటంతో.. ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..