AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Gunfire: అమెరికాలో తెలుగువారిపై మళ్లీ కాల్పుల మోత.. ఓ విద్యార్థి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

అమెరికాలో తెలుగువారిపై మళ్లీ కాల్పుల మోత మోగింది. తుపాకీ తూటాకు విజయవాడకు చెందిన ఓ విద్యార్ధి చనిపోగా.. హైదరాబాద్ కుర్రాడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. 

US Gunfire: అమెరికాలో తెలుగువారిపై మళ్లీ కాల్పుల మోత.. ఓ విద్యార్థి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
Usa Gun Fire
Surya Kala
|

Updated on: Jan 24, 2023 | 6:32 AM

Share

అగ్రరాజ్యంలో గన్ కల్చర్ రోజు రోజుకీ ఆందోళన కలిగిస్తుంది. ఎందరో తుపాకీ కాల్పులలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాస్తవానికి అమెరికాలో పై చదువులు అంటే అందని ద్రాక్ష లాంటిది. అక్కడి యూనివర్సిటీల్లో చదవాలని చాలా మంది విద్యార్ధులు ఆశ పడుతుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అలా సీటు సంపాదించిన వాళ్లంతా ఎన్నో ఆశలతో ఎగిరెల్లిపోతున్నారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా చికాగోలో ఇద్దరు తెలుగు విద్యార్ధులపై కాల్పులు జరిగాయి. విజయవాడకు చెందిన దేవాన్ష్‌ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్‌ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. ఛాతీ భాగంలో బుల్లెట్ దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న సాయిచరణ్ తల్లిదండ్రులు.. మీడియాలో వార్తలు ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారంతో విషయాన్ని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

పది రోజుల క్రితమే చరణ్.. చికాగో వెళ్లాడు. యునివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఆ వాతావరణానికి ఇంకా అలవాటు కూడా పడలేదు. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు విద్యార్ధులు.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో వచ్చి అడ్డగించిన దుండగులు.. వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ లాకున్నారు. భయంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా.. గన్ ఫైరింగ్ చేసినట్టు స్నేహితులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..