Viral Video: లండన్‌లో ఇండియన్ బారాత్.. పంజాబీ పెళ్లిలో బ్యాండ్ ప్లే చేసిన బ్రిటిషర్లు..
వరుడిని ఊరేగిస్తూ బారాత్ నిర్వహించారు. ఇక్కడ విశేషమేంటంటే.. ఈ పెళ్లిలో బ్రిటిషర్లు బ్యాండ్ వాయించారు. అంతేకాదు పెళ్లికొడుకు గుర్రంపై కూర్చుని ఉండగా.. ఆ గుర్రాన్ని హ్యాండిల్ చేసింది కూడా ఓ బ్రిటిష్ వ్యక్తే.

భారతీయ సంప్రదాయంలో పెళ్లి వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతీయులు ఎక్కడ ఉన్నా తమ సంప్రదాయం మరచిపోమని పలు సందర్భాల్లో రుజువు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారతీయుల పెళ్లి అంటే మామూలుగా ఉండదు.. బ్యాండ్ బాజాలతో, డీజే సౌండ్స్‌తో బారాత్ దద్దరిల్లిపోవాల్సిందే. ఇండియాలో ఇది కామన్.. కానీ ఇదే లండన్‌లో జరిగితే ఇది వెరైటీ.. తాజాగా అదే జరిగింది. లండన్‌లో ఓ పంజాబీ కుటుంబంలో పెళ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా వరుడిని ఊరేగిస్తూ బారాత్ నిర్వహించారు. ఇక్కడ విశేషమేంటంటే.. ఈ పెళ్లిలో బ్రిటిషర్లు బ్యాండ్ వాయించారు. అంతేకాదు పెళ్లికొడుకు గుర్రంపై కూర్చుని ఉండగా.. ఆ గుర్రాన్ని హ్యాండిల్ చేసింది కూడా ఓ బ్రిటిష్ వ్యక్తే.
నేత్రపర్వంగా సాగిన ఈ బారాత్ వీడియోను కంప్లీట్ సర్కిల్ వెల్త్ మేనేజింగ్ పార్టనర్, సీఐఓ గుర్మీత్ చద్దా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పంజాబీ వెడ్డింగ్‌కు బ్యాండ్ వాయించిన ఆంగ్లేయులు..మనోళ్ల క్లాసిక్ రివెంజ్..! అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షమందికి పైగా వీక్షించారు. అంతేకాదు వీడియోను లైక్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.




Angrezon se band and dhol bajwa rahe hain Punjabi :). Classic Revenge by Indians.
( on a lighter note guys) pic.twitter.com/DPmp5UByRZ
— Gurmeet Chadha (@connectgurmeet) January 20, 2023
పంజాబీలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు” అని ఒక వినియోగదారు రాశారు. డబ్బులు మాట్లాడతాయని ఇప్పటి వరకూ విన్నాను.. ఇప్పుడు అది చూస్తున్నాను.. ఒకరు కామెంట్ చేయగా.. “ఇది మెక్ డోనాల్డ్ మెక్ ఆలూ టికీ బర్గర్‌ని అందిస్తున్నట్లుగా ఉందన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
