AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: వైకల్యంతో పుట్టాడని కన్నవాళ్లు వదిలేశారు.. అక్కున చేర్చుకున్న మహిళ.. కట్ చేస్తే వరల్డ్‌ రికార్డ్‌

జన్మనిచ్చిన వాళ్లు అంగ వైకల్యాన్ని చూసి వదిలేశారు. అనాధాశ్రమంలో ఉన్న ఆ చిన్నారిని ఓ తల్లి దయతో అక్కున చేర్చుకుంది. దత్తత తీసుకుని చదువు చెప్పించడమే కాదు. వరల్డ్‌ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఆ తల్లి ఆదరణతో...

Trending: వైకల్యంతో పుట్టాడని కన్నవాళ్లు వదిలేశారు.. అక్కున చేర్చుకున్న మహిళ.. కట్ చేస్తే వరల్డ్‌ రికార్డ్‌
Gian Clark
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Jan 24, 2023 | 1:51 PM

Share

జన్మనిచ్చిన వాళ్లు అంగ వైకల్యాన్ని చూసి వదిలేశారు. అనాధాశ్రమంలో ఉన్న ఆ చిన్నారిని ఓ తల్లి దయతో అక్కున చేర్చుకుంది. దత్తత తీసుకుని చదువు చెప్పించడమే కాదు. వరల్డ్‌ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఆ తల్లి ఆదరణతో కాళ్లు లేకున్నా చేతులనే కాళ్లుగా మార్చుకుని అత్యంత వేగంగా పరుగెత్తి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పాడు. అతనే జియాన్‌ క్లార్క్‌. వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపించాడు జియాన్‌ క్లార్క్‌. తన సంకల్ప బలంతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒహియో స్టేట్‌లోని కొలంబస్‌ ప్రాంతానికి చెందిన క్లార్క్‌ వైకల్యంతో పుట్టాడు. కయుడాల్‌ రిగ్రెసివ్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి కారణంగా అతను నడుము కింది భాగం లేకుండా పుట్టాడు. ఈ కారణంగా పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అతన్ని వదిలేశారు. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగిన క్లార్క్‌ కథ తెలుసుకున్న.. ప్రముఖ అమెరికన్‌ స్టాక్‌మార్కెట్‌ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్‌ అతన్ని దత్తత తీసుకున్నారు. తన ఇద్దరి బిడ్డలతో సమానంగా అతన్ని పెంచి, చదివించారు.

హాకిన్స్‌ సంరక్షణలో క్లార్క్‌ అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎదిగాడు.. చదువుతోపాటు.. వీల్‌చైర్‌ రేసర్‌గా రాటుదేలాడు. అంతేకాదు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌గా, రెజర్ల్‌గానూ అలరించాడు. చేతులనే కాళ్లుగా మార్చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా చేతులతో పరిగెత్తిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మీటర్ల దూరాన్ని.. కేవలం 4.78 సెకెన్లలో చేతులతో పరిగెత్తి చూపించాడు జియాన్‌. 2021లోనే అతను ఈ ఘనత సాధించాడట. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌వారు ట్విటర్‌ ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. అతని జీవితం జియాన్‌ పేరుతో డాక్యుమెంటరీగా తీసారు. అది సూడాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపిక కావడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్‌ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ 40 స్పోర్ట్స్‌ ఎమ్మీ అవార్డుల్లో రెండు ఎమ్మీలను దక్కించుకుంది. ఆ తర్వాత చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కాడు. అక్కడితో ఆగిపోలేదు జియాన్‌.. 2022లో కూడా రెండు గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పాడు. త్వరలో మరో రెండు రికార్డులు నెలకొల్పనేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జన్మనిచ్చిన వాళ్ల సంగతి ఏమోగానీ.. ఈ తల్లి రుణం తీర్చుకోలేనిదని చెప్తున్నాడు జియాన్‌.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ