YS Sharmila: పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిల.. ఆగ్రహించిన ఖాకీలు.. వీడియో
నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటిదగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. లోటస్‌పాండ్ దగ్గరే నిలువరించారు.
నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల ఇందిరా పార్క్ దగ్గరకు వెళ్తుండగా.. ఆమెను ఇంటిదగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. లోటస్‌పాండ్ దగ్గరే నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరనస తెలిపారు. దీంతో.. చివరికి ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే అరెస్ట్ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు షర్మిల. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
షర్మిల అరెస్ట్ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ రాగా.. ఆమెను లోపలికి అనుమతించలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..