AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు..

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం పద్ధతిగా మాట్లాడాలని.. సర్కార్, మంత్రులు హామీలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ నేతలు సూచించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా మారలేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహిస్తూ బాల్క సుమన్ ఒక రేంజ్‌లో మాటలు ఝుళిపించారు.

Telangana: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు..
Balka Suman Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2024 | 9:32 PM

Share

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం పద్ధతిగా మాట్లాడాలని.. సర్కార్, మంత్రులు హామీలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ నేతలు సూచించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా మారలేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహిస్తూ బాల్క సుమన్ ఒక రేంజ్‌లో మాటలు ఝుళిపించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ రెచ్చిపోయారు. సంస్కారం అడ్డువస్తోంది అంటూనే.. అసభ్యపదజాలంతో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పద్దతిగా మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. అయితే, బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు.

కాగా.. కేసుతో పాటు సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బాల్క శవయాత్ర కూడా చేసి నిరసన తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే బాల్క సుమన్‌ను మంచిర్యాలలో తిరగినివ్వమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..