AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులే.. కుతకుతలాడుతున్న తెలంగాణ రాజకీయం..

రాగల 48 గంటల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఓ రేంజ్‌లో వేడెక్కబోతోంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లే అవకాశముంది. కారణం ఈనెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు. పేరుకు బడ్జెట్ సమావేశాలే ఐనా... అంతకుమించి స్టఫ్‌ దొరకడం పక్కా. రేవంత్‌రెడ్డి అయామ్ రెడీ అంటుంటే.. వామప్‌ మీటింగులతో బిజీగా ఉన్నారు కేసీఆర్..

Telangana Politics: రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులే.. కుతకుతలాడుతున్న తెలంగాణ రాజకీయం..
KCR - Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2024 | 9:55 PM

Share

రాగల 48 గంటల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఓ రేంజ్‌లో వేడెక్కబోతోంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లే అవకాశముంది. కారణం ఈనెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు. పేరుకు బడ్జెట్ సమావేశాలే ఐనా.. అంతకుమించి స్టఫ్‌ దొరకడం పక్కా. రేవంత్‌రెడ్డి అయామ్ రెడీ అంటుంటే.. వామప్‌ మీటింగులతో బిజీగా ఉన్నారు కేసీఆర్.. ఈనెల 8.. అంటే ఈ గురువారం నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ. రేవంత్‌ సర్కార్‌ ఏర్పడ్డ తర్వాత ఇది తొలి బడ్జెట్ సెషన్. ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెట్టే ఐనా, జరిగేది పదిరోజులే ఐనా అధికార-విపక్షాల మధ్య మంటలు మాత్రం మామూలుగా ఉండవు. అప్పులు అండ్ ఆరు గ్యారంటీలు.. ధరణి- దాని రద్దు గొడవ.. ఇరిగేషన్ ప్రాజెక్టులు- కేఆర్‌ఎంబీకి వాటి అప్పగింతలు.. ఇలా బడ్జెట్‌ కంటే బడ్జెట్‌యేతర అంశాలే ఇక్కడ కీలకం కాబోతున్నాయి.

ఇటీవలే చెలరేగిన కేఆర్‌ఎంబీ వివాదం అసెంబ్లీ వేదికగా మళ్లీ రాజుకోనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం.. కాచుకో అంటూ రేవంత్‌ విసిరిన సవాల్‌ టేకప్ చేసింది బీఆర్‌ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు రాబోతున్నారు కేసీఆర్. కృష్ణా బేసిన్‌ పరిధిలోని ఐదు జిల్లాల నేతలతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమవుతారు. ఈ మారథాన్ భేటీ సాయంత్రం వరకు కొనసాగనుంది. కేఆర్‌ఎంబీకి సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై లోతుగా చర్చించి, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా నిలదియ్యాలో ఇక్కడే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు గులాబీ బాస్. ముందస్తుగా నందినగర్‌లోని నివాసంలో సోమవారం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. బీఆర్‌ఎస్‌పై చేస్తున్న ఆరోపణలకు దీటుగా జవాబివ్వడం, జలహక్కుల సాధనకు తాము పదేళ్లలో చేసిన కృషిని వివరించడం.. ఇదీ ఎజెండా.

అసెంబ్లీలో రీసౌండ్ ఇవ్వనున్న మరో టాపిక్ ధరణి. కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి అధ్యయన కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశమైంది. కలెక్టర్లతో, వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించింది. ధరణి చట్టంతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం 35 మాడ్యూల్స్‌ను పరిశీలించింది. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధమవుతోంది. ధరణితో జరిగిన నిర్వాకాల్ని ఏకరువు పెట్టడానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ . దీటుగా ఎదుర్కోడానికి రెడీ అంటోంది ఎబీఆర్‌ఎస్. సో.. రాగల 48 గంటల్లో అసెంబ్లీ వేదికగా ఉరుములు-మెరుపులు ఖాయమన్నమాట..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే