Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక్కడ సిట్టింగ్‎లను మార్చాల్సిందే.. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు టికెట్ వద్దంటున్న బీఆర్ఎస్ అసమ్మతి నేతలు..

Karimnagar News: కరీంనగర్ జిల్లా చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారా ?.. కొత్త వారికీ అవకాశం ఇస్తారా ?. ఈ అనవయితీ.. గత ఎన్నికల్లో కూడా జరిగింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ అసమ్మతి నేతలు రెచ్చిపోతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం నోరు విప్పడం లేదు. రాజీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అసమ్మతి నేతలు మాత్రం.. నో రాజీ అంటున్నారు.

Telangana: ఇక్కడ సిట్టింగ్‎లను మార్చాల్సిందే.. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు టికెట్ వద్దంటున్న బీఆర్ఎస్ అసమ్మతి నేతలు..
Cm Kcr And Mla Ravi Shankar
Follow us
G Sampath Kumar

| Edited By: Aravind B

Updated on: Aug 05, 2023 | 4:23 PM

కరీంనగర్, ఆగస్టు 5 : కరీంనగర్ జిల్లా చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారా ?.. కొత్త వారికీ అవకాశం ఇస్తారా ?. ఈ అనవయితీ.. గత ఎన్నికల్లో కూడా జరిగింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ అసమ్మతి నేతలు రెచ్చిపోతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం నోరు విప్పడం లేదు. రాజీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అసమ్మతి నేతలు మాత్రం.. నో రాజీ అంటున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేపై అసమ్మతి జ్వాలలైతే కనిపించాయో.. ఇప్పుడూ అదే పునరావృతమైంది. అప్పుడు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభైతే.. ఇప్పుడు సుంకె రవిశంకర్ వంతు. అంతేకాదు.. బొడిగె శోభ కంటే ఈయన ఏం తక్కువ కాదని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ కు వ్యతిరేకంగా మండలాలవారీగా వర్గాలు తయారయ్యాయి. అంతేకాదు.. తమ అభ్యర్థులుగా కొందరిని తయారుచేసుకుని.. ఈసారి సిట్టింగ్‎కు టిక్కెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ అసమ్మతి నేతలు.

చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నిలబెట్టేందుకు ప్రస్తుతం వెలిచాలకు చెందిన యాదగిరి పేరు బాగా వినిపిస్తోంది. ఈయన వెనుక నియోజకవర్గంలోని నాలుగైదు కీలక మండలాల నేతలుండగా.. మరోవైపు కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ వంటివారి పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యేపై వరదల్లాగే ఫిర్యాదులు అధిష్ఠానంకు వెల్లువెత్తడంతో.. అధిష్ఠానం చొప్పదండిపై కాన్సంట్రేట్ చేసింది. కట్ చేస్తే ఇటీవల కరీంనగర్లోని ఓ హోటల్ వేదికగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలోనే అసమ్మతి నేతలతో కలిసి.. మంత్రి గంగులను కూడా పిలిచి.. మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తానే పెద్దమనిషిగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పంచాయితీ తెంపుదామని పిలిస్తే.. మీటింగ్ కాస్తా రచ్చరచ్చగా మారింది. ఇలాంటి సమయంలో ఇలా వ్యవహరిస్తే పార్టీ పరువు పోతుందని.. ప్రతిపక్షాలు దాన్ని ఎన్ క్యాష్ చేసుకునే అవకాశముందని నచ్చజెప్పి అందరినీ పంపించేశారట మాజీ ఎంపీ వినోద్.

తాత్కాలికంగా కరీంనగర్ హోటల్ రూమ్ లో చల్లబడినట్టు కనిపించినా.. చాలాకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకెపై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతల్లో ఉపద్రవంలా పెల్లుబికుతున్న లావా.. ఎన్నికలనాటికి చల్లబడుతుందా అన్నది ఇప్పుడు మరో క్వొశ్చన్ మార్క్..? గతంలో బొడిగె శోభకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్న అసమ్మతి నేతలు.. ఈసారి సుంకె విషయంలోనూ సక్సెస్ అయ్యి.. చొప్పదండి అధికారపార్టీ అభ్యర్థి మార్పు ఫార్ములాను కంటిన్యూ చేయగలరా అన్నది ఇప్పుడు మరో చర్చ. ఈ నేపథ్యంలో చొప్పదండికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థెవ్వరనే చర్చ ఊపందుకోవడంతో పాటు.. యాదగిరి వంటి నేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. గతంలో శోభకు టికెట్ ఇవ్వకుండా చేసింది అసమ్మతి నేతలే. ఇప్పుడు మళ్ళీ ఆ నేతలే టికెట్ వద్దంటున్నారు. సుంకే రవి శంకర్ మాత్రం.. ఇక తప్పులు జరగవు. కలిసి నడుద్దామని అంటున్నారు. అసమ్మతి నేతలు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..