Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మీకు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా? జాగ్రత్త.. ఆన్‌లైన్‌ మోసాలపై తెలంగాణ విద్యుత్‌ బోర్డు హెచ్చరిక

అలా దేశంలో రకరకాలుగా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నేరాలపై పోలీసులు సైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందనో, డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయ్యిందనో, మీకు లాటరీ తగిలిందనో ఇలా ఒక్కటేమిని రకరకాల కారణాలు చూపుతూ సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా మోసగిస్తున్నట్లు తెలంగాణలో విద్యుత్‌ విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయని, విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు హెచ్చరిస్తూ బురిడీ కొట్టిస్తున్నారని..

Telangana: మీకు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా? జాగ్రత్త.. ఆన్‌లైన్‌ మోసాలపై తెలంగాణ విద్యుత్‌ బోర్డు హెచ్చరిక
Telangana Electricity Board
Follow us
Subhash Goud

|

Updated on: Aug 05, 2023 | 8:06 PM

టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు అమాయకులను ఆసరా చేసుకుని నిలువునా దోచేస్తున్నారు. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. బిల్లులు వెంటనే చెల్లించకుంటే విద్యుత్‌ను నిలిపివేస్తామని బెదిరించి ప్రజలను మోసం చేసే ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడవద్దని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రజలను హెచ్చరించింది. “విద్యుత్ మోసం” కేసుల నేపథ్యంలో ఈ సలహా ఇస్తోంది. “ప్రియమైన కస్టమర్, మీ విద్యుత్తు డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. ఈరోజు రాత్రి 9:30 గంటలకు విద్యుత్ అధికారి నుంచి మా మునుపటి నెల బిల్లు చెల్లింపులు చేయలేదు. దయచేసి వెంటనే విద్యుత్ అధికారి +91 XXXXX XXXXని సంప్రదించండి. ధన్యవాదాలు అంటూ సందేశాలు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

అయితే ఆందోళనకు గురై బాధితులు స్కామర్లు అందించిన నంబర్‌కు కాల్ చేస్తే వారి ఫోన్‌లో మరింత సపోర్ట్‌కు, ఏదైనా డెస్క్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయలాని కోరుతున్నారు. ఇక బాధితులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, మోసగాడితో స్క్రీన్‌ను పంచుకున్న వెంటనే, వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ వివరాలు దొంగిలించబడతాయి. బ్యాంకులో ఉన్న మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఇతర పద్ధతుల ద్వారా విత్‌డ్రా చేస్తారు అని సైబర్ క్రైమ్ అధికారి ఒకరు తెలిపారు.

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అడ్వైజరీ ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తోంది. “TSSPDCL బిల్లు చెల్లింపుల కోసం ఎటువంటి వెబ్‌సైట్ లింక్‌లను ఎప్పటికీ పంపదు. విద్యుత్ బిల్లు చెల్లింపులకు సంబంధించిన మోసపూరిత కాల్‌లు లేదా సందేశాల గురించి తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దు. బిల్లు చెల్లింపుల కోసం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము” అని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఏదైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే తక్షణ ఫిర్యాదుల కోసం 1930 కాల్‌ చేయాలని, ఈ నెంబర్‌ 24/7 పని చేస్తుందని తెలిపింది. అలాగే ఇలాంటి సమస్య ఎదురైనట్లయితే మీరు సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలా దేశంలో రకరకాలుగా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నేరాలపై పోలీసులు సైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందనో, డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయ్యిందనో, మీకు లాటరీ తగిలిందనో ఇలా ఒక్కటేమిని రకరకాల కారణాలు చూపుతూ సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా మోసగిస్తున్నట్లు తెలంగాణలో విద్యుత్‌ విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయని, విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు హెచ్చరిస్తూ బురిడీ కొట్టిస్తున్నారని, ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ విద్యుత్‌ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యలేమైనా ఎదుర్కొన్నట్లుతే జాగ్రత్తగా ఉండటం మంచిది. పొరపాటున నిర్లక్ష్యం చేసి ఉన్న వివరాలన్నీ నేరగాళ్లకు చెప్పినట్లయితే నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది. సో.. బీ కేఆర్‌ఫుల్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి