Internet: టెలికాం పరిశ్రమకు షాక్.. ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ ఛానల్స్‌.. ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌

చాలా మంది ఇళ్లలో టీవీలు ఉండటం తప్పనిసరి. ప్రస్తుత రోజులలో టీవీ లేనిది ఉండని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుండటంతో మొబైల్‌ వాడకం కూడా పెరిగిపోయింది. టీవీల్లో వివిధ రకాల ఛానెళ్లను ఇప్పుడు మొబైల్‌లో కూడా చూసే సదుపాయం రానుంది. దీని కోసం కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం కనుక అందుబాటులోకి వస్తే మొబైల్‌ కంపెనీలకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే టీవీల్లోకి వచ్చే ఛానెళ్లు నేరుగా మొబైల్‌లోకి వస్తే ఆ ప్రభావం టెలికం కంపెనీ డేటాపై పడుతుంది.

Internet: టెలికాం పరిశ్రమకు షాక్.. ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ ఛానల్స్‌.. ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌
Direct2mobile Tv
Follow us
Subhash Goud

|

Updated on: Aug 05, 2023 | 5:13 PM

ప్రస్తుతం మీ ఇంటి వద్ద ఉన్న డిష్ కనెక్షన్ ద్వారా ఛానెల్‌లు నేరుగా టీవీలో ప్రసారం అవుతుంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ ‘డైరెక్ట్ 2 హోమ్’ (D2H) సౌకర్యం తరహాలో ప్రభుత్వం ఇప్పుడు ‘డైరెక్ట్ 2 మొబైల్’ (D2M) సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. అంటే మీ టీవీ స్క్రీన్‌కు బదులుగా, మీరు నేరుగా మొబైల్ స్క్రీన్‌పైనే టీవీ ఛానెల్‌లను చూడగలుగుతారు. దీని వల్ల టెలికాం కంపెనీలకు పెద్ద దెబ్బే పడుతుందనే చెప్పాలి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు చెందిన చాలా మంది కస్టమర్‌లు కేవలం వినోద కంటెంట్‌ని చూడటానికి ఫోన్‌లో ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు మొబైల్‌లో మాత్రమే డైరెక్ట్‌ టీవీ సౌకర్యాన్ని పొందినట్లయితే అప్పుడు కంపెనీలు ఇంటర్నెట్‌ని ఉపయోగించే కస్టమర్లకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత నష్టాన్ని భరించవలసి ఉంటుంది.

ప్రభుత్వం ‘D2M’ ప్రణాళిక

ప్రస్తుతం కేబుల్ కనెక్షన్లు లేదా డీ2హెచ్‌ ద్వారా చేస్తున్న విధంగా టీవీ ఛానెల్‌లను నేరుగా ప్రజల మొబైల్ స్క్రీన్‌లపై ప్రసారం చేసే సాంకేతికతను పరీక్షించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఐటీ కాన్పూర్, టెలికాం శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ దిశగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించిన టెస్టింగ్ మాత్రమే జరుగుతోందని ఈ విషయంపై సమాచారం ఉన్న ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు, ఇతర వాటాదారులతో చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

దేశంలో 800 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు

ప్రస్తుతం దేశంలో టీవీలు దాదాపు 22 కోట్ల ఇళ్లకు చేరుకోగా, దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 80 కోట్లు ఉండగా, 2026 నాటికి ఇది 100 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫోన్‌లో 80 శాతం ఇంటర్నెట్ వినియోగం వీడియోపైనే ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఫోన్‌లో టీవీ చూసే సదుపాయాన్ని అందించడం మార్కెట్‌లో పెద్ద గేమ్‌గా మారనుంది. అదే సమయంలో బ్రాడ్‌కాస్ట్ కంపెనీలు కూడా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించవచ్చని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొబైల్ నెట్ వర్క్ కాల్స్ తదితరాలకు ఫ్రీగా ఉండేందుకు వీలుగా కాల్ డ్రాప్స్ సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

వచ్చే వారం కీలక సమావేశం

చాలా టెలికాం కంపెనీలు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి డేటా ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. కంపెనీల డేటా వినియోగంలో ఎక్కువ భాగం వీడియోలో మాత్రమే ఉంది. ఈ ప్రతిపాదన కంపెనీల 5G విస్తరణకు కూడా షాక్ ఇస్తుందనే చెప్పాలి. డైరెక్ట్ 2 మొబైల్ సేవకు సంబంధించి వచ్చే వారం పెద్ద సమావేశం జరగబోతోంది. ఇందులో టెలికమ్యూనికేషన్స్ శాఖతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఐఐటీ కాన్పూర్ అధికారులు పాల్గొంటారు. దీనితో పాటు టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సినిమాల్లోకి దళపతి విజయ్ కుమారుడు.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
సినిమాల్లోకి దళపతి విజయ్ కుమారుడు.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
పొట్టేలు బలిచ్చి పూజలు.. భయం గుప్పెట జనం!
పొట్టేలు బలిచ్చి పూజలు.. భయం గుప్పెట జనం!
శ్రీశైలంలో మంత్రి సీతక్క.. ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలంలో మంత్రి సీతక్క.. ఆలయంలో ప్రత్యేక పూజలు
స్ట్రోక్‌తో 2050 నాటికి 10 మిలియన్ల మరణాలు.. భారతీయులకు హెచ్చరిక!
స్ట్రోక్‌తో 2050 నాటికి 10 మిలియన్ల మరణాలు.. భారతీయులకు హెచ్చరిక!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
మీ రిలేషన్‌షిప్ బిందాస్‌గా ఉండాలా? ఈ 4 సిక్రెట్స్ మీ కోసమే..
మీ రిలేషన్‌షిప్ బిందాస్‌గా ఉండాలా? ఈ 4 సిక్రెట్స్ మీ కోసమే..
సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే..
సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే..
హార్దిక్ పాండ్యా రూ. 400 ఫీజుకు చిన్ననాటి సెలక్టర్‌కు ధన్యవాదాలు
హార్దిక్ పాండ్యా రూ. 400 ఫీజుకు చిన్ననాటి సెలక్టర్‌కు ధన్యవాదాలు
ముసలి వాళ్లమైపోతే మన చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా?
ముసలి వాళ్లమైపోతే మన చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా?
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..