Parle-G Biscuits: పార్లే-జి బిస్కెట్‌ ప్యాక్‌పై ఉండే ఈ చిన్నారి ఎవరు? సీక్రెట్ రివీల్ చేసిన కంపెనీ మేనేజర్‌

మన దేశంలో చాలా మందికి బిస్కెట్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పార్లే- జీ. దేశంలో పార్లేజీ బిస్కెట్లు రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది పార్లే-జి బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 8000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తుంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ బిస్కెట్ ప్యాక్‌లో ఒక చిన్న అమ్మాయి..

Parle-G Biscuits: పార్లే-జి బిస్కెట్‌ ప్యాక్‌పై ఉండే ఈ చిన్నారి ఎవరు? సీక్రెట్ రివీల్ చేసిన కంపెనీ మేనేజర్‌
Parle-G
Follow us

|

Updated on: Aug 04, 2023 | 10:12 PM

మన దేశంలో చాలా మందికి బిస్కెట్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పార్లే- జీ. దేశంలో పార్లేజీ బిస్కెట్లు రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది పార్లే-జి బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 8000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తుంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ బిస్కెట్ ప్యాక్‌లో ఒక చిన్న అమ్మాయి అందమైన చిత్రం కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ చిన్నారి ఎవరు? పార్లే-జి కంపెనీ ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పార్లే-జి కంపెనీ ఎలా ప్రారంభమైంది:

1929లో చౌహాన్ కుటుంబానికి చెందిన మోహన్ లాల్ దయాల్ ముంబైలోని విలే పార్లేలో ‘పార్లే’ అనే స్వదేశీ కంపెనీని స్థాపించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశంలో దేశీయ ఉత్పత్తుల కోసం ఉద్యమం ప్రారంభమైంది. దీని వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో స్వదేశీ ఉత్పత్తులను చూసి ముగ్ధుడైన మోహన్ లాల్ దేశంలోనే మిఠాయి ఉత్పత్తులను తయారు చేయాలని ఆలోచించారు. ఇందుకోసం ఆయన జర్మనీ పర్యటనలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించారు. జర్మనీకి వెళ్లాక బిస్కెట్ల తయారీలో నైపుణ్యం సంపాదించాడు. అలాగే బిస్కెట్ల తయారీకి అవసరమైన ఉపకరణాలు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటారు. అప్పట్లో దీని విలువ రూ.60 వేలు. మోహన్ లాల్ తన నైపుణ్యంతో పాటు కేవలం 12 మంది కార్మికులతో పార్లే కంపెనీని ప్రారంభించారు. తర్వాత అది దేశంలోనే అత్యంత రుచికరమైన బిస్కెట్‌గా అవతరించి. ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంది పార్లే.

పిల్లలకు గ్లూకోజ్ డోస్ ఇవ్వడానికి పార్లే-గ్లూకో పేరుతో మొదట ఈ బిస్కెట్‌ను విడుదల చేశారు. 1980లో గ్లూకోకు బదులుగా కంపెనీ కేవలం G, అంటే పార్లే-G అనే పేరును ఉపయోగించడం ప్రారంభించింది. ప్రారంభంలో G అంటే గ్లూకోజ్. తర్వాత జీనియస్‌గా పేరు తెచ్చుకుంది. అంటే ప్రతిభావంతులైన వారు ఈ బిస్కెట్‌ను తింటారనేది కంపెనీ లక్ష్యం. అప్పటి నుంచి ఇది పార్లే-జిగా ప్రసిద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

పార్లే జి బిస్కెట్ ప్యాకెట్‌లో ఉన్న అమ్మాయి ఎవరు?

పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి బొమ్మ ఎవరిది అన్నది దశాబ్దాలుగా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇది ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫోటో అని చాలామంది భావించారు. కొందరు అది నీరూ దేశ్‌పాండే అని, మరికొందరు చిత్రంలో ఉన్న అమ్మాయి గుంజన్ దుండానియా అని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ మిస్టరీ అమ్మాయి సీక్రెట్ రివీల్ అయింది. పార్లే-జి బిస్కెట్ బాక్స్‌పై ఉన్న అమ్మాయి ఫోటో ఎవరిది కాదని పార్లే జి గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా తెలిపారు. ఇది కల్పిత చిత్రం మాత్రమేనని, ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ మగన్ లాల్ దహియా 1960లో రూపొందించారని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!