Xiaomi Independence Day Sale: ఎంఐ వెబ్‌సైట్‌లో ఇండిపెండెన్స్ డే ఆఫర్లు షురూ.. ఆ ఫోన్లు..టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు..
షియోమీ ఇండియా శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్‌లు తమకు ఇష్టమైన ఎంఐ ఉత్పత్తులను తగ్గింపు ధరల్లో పొందవచ్చు. ఈ సేల్ ప్రత్యేకంగా ఎంఐ వెబ్‌సైట్‌లో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తున్నారు. కస్టమర్లు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) ఎకోసిస్టమ్ గాడ్జెట్‌లతో సహా అనేక ఎంఐ ఉత్పత్తులపై ఆఫర్‌లను పొందవచ్చు.

ప్రస్తుతం భారతదేశంలో సేల్స్ సందడి నడుస్తుంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ సేల్స్ పెరిగిన నేపథ్యంలో ప్రతి పండుగకు అన్ని ఈ కామర్స్ వెబ్‌సైట్లు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు ఇప్పటికే సేల్స్‌తో సందడి చేస్తున్నాయి. తాజాగా ఎంఐ కంపెనీ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఎంఐ ఇండిపెండెన్స్ డే సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్లో ఆ కంపెనీకు సంబంధించిన చాలా ఉత్పత్తులపై స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. షియోమీ ఇండియా శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్‌లు తమకు ఇష్టమైన ఎంఐ ఉత్పత్తులను తగ్గింపు ధరల్లో పొందవచ్చు. ఈ సేల్ ప్రత్యేకంగా ఎంఐ వెబ్‌సైట్‌లో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తున్నారు. కస్టమర్లు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) ఎకోసిస్టమ్ గాడ్జెట్‌లతో సహా అనేక ఎంఐ ఉత్పత్తులపై ఆఫర్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో డిస్కౌంట్‌లో లభించే ఉత్పత్తుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఫోన్లపై ఆఫర్లు ఇలా
ఎంఐ కంపెనీకు చెందిన ఎంఐ 12 ప్రో (12జీబీ+256జీబీ), రెడ్‌మీ నోట్ 12 5జీ (4జీబీ+128జీబీ), రెడ్‌మీ 12సీ (4జీబీ+64జీబీ) ఫోన్లపై కంపెనీ రూ. 1,300 నుంచి రూ. 5,000 వరకు తగ్గింపును అందిస్తుంది.
ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు
ఎంఐ ఎక్స్-65 2023 ఎడిషన్, ఎంఐ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో 55, రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 అంగుళాల వేరియంట్‌లో రూ. 3,000 నుంచి రూ. 4,200 వరకు తగ్గింపును అందిస్తోంది. రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్, షియోమి గ్రూమింగ్ కిట్ ప్రో, రెడ్‌మీ స్మార్ట్ బెడ్‌సైడ్ ల్యాంప్ 2పై రూ.1,199 నుంచి రూ.2,699 వరకు తగ్గింపు ధరతో పొందవచ్చు. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే సేల్ సందర్భంగా రెడ్‌మీ నోట్ 12 ప్రో కొత్త వేరియంట్‌ను 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ప్రారంభించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. రెడ్‌మి వాచ్ 3 యాక్టివ్‌ను ప్రస్తుతం రూ. 2,999 నుండి ఆఫర్ చేస్తుంది. అలాగే ఎంఐ స్మార్ట్‌టీవీ ఎక్స్ సిరీస్ కూడా రూ. 26,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..