AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart phone: ఒక శాతం ఛార్జింగ్‌తో గంట పాటు ఫోన్‌ మాట్లాడుకోవచ్చు.. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏంటంటే.

కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారికి ప్రధాన..

Smart phone: ఒక శాతం ఛార్జింగ్‌తో గంట పాటు ఫోన్‌ మాట్లాడుకోవచ్చు.. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏంటంటే.
Smartphone
Narender Vaitla
|

Updated on: Apr 17, 2023 | 9:42 PM

Share

కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారికి ప్రధాన సమస్యల్లో ఛార్జింగ్‌ ఒకటని తెలిసిందే. దీనికి చెక్‌ పెట్టేందుకే షావోమీ ఓ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో ఒక శాతం చార్జింగ్‌ ఉన్నా ఏకంగా గంటపాటు ఫోన్‌ పనిచేస్తుంది.

షావోమీ 13 అల్ట్రా పేరుతో ఓ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. త్వరలోనే ఈ ఫోన్‌ చైనా మార్కెట్లోకి రానుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట్‌ లీక్‌ అయిన కొన్ని వివరాల ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. నైట్ సీన్స్‌, 8కే వీడియో తీసుకోవడానికి ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఒక శాతం ఛార్జింగ్‌తో ఏకంగా గంటపాటు ఫోన్‌ మాట్లాడుకోవచ్చని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ 2కే అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను ఇవ్వనున్నారు. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వచ్చే నెల ప్రారంభంలో ఈ ఫోన్‌ లాంచ్‌ కానున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ