Video: రన్నింగ్‌లో టైర్ పేలినా.. ఇకపై నో టెన్షన్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఎలక్ట్రిక్ సూపర్‌కార్.. అదిరిపోయే ఫీచర్లు..

BYD YangWang U9: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) షాంఘై ఆటో షోలో తన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ సూపర్‌కార్ యాంగ్‌వాంగ్ U9ని పరిచయం చేసింది. ఈ కారు పరిచయంతో పాటుగా, కంపెనీ ఒక సంచలనాత్మక సాంకేతికతను కూడా ప్రదర్శించింది.

Video: రన్నింగ్‌లో టైర్ పేలినా.. ఇకపై నో టెన్షన్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఎలక్ట్రిక్ సూపర్‌కార్.. అదిరిపోయే ఫీచర్లు..
Byd Yangwang U9 Car
Follow us
Venkata Chari

|

Updated on: Apr 17, 2023 | 6:30 PM

చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) షాంఘై ఆటో షోలో తన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ సూపర్‌కార్ యాంగ్‌వాంగ్ U9ని పరిచయం చేసింది. ఈ కారు పరిచయంతో పాటుగా, కంపెనీ ఒక సంచలనాత్మక సాంకేతికతను కూడా ప్రదర్శించింది. దీనిని Disus-X అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోడ్డుపై మూడు చక్రాలపై కూడా పరుగెత్తగలదన్నమాట.

BYD వేదికపై YangWang U9 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టగానే, అది మీడియా ముందు బౌన్స్ అవుతూ కనిపించింది. ఇది Mercedes-Benz GLE ఎయిర్ సస్పెన్షన్‌లో కనిపించే విధంగా ఉంటుంది. అయితే, BYD సూపర్‌కార్‌లో ఉపయోగించినది మరింత అధునాతనమైన ఫీచర్ అని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, కారు కేవలం మూడు చక్రాల మీద డ్రైవింగ్ చేయడం, కారు ఫ్రంట్ రైడ్ వైపు చక్రం లేకపోయినా, కారు చాలా సాఫీగా నడుస్తున్నట్లు కూడా చూపించారు.

Disus-X టెక్నాలజీ అంటే..

Disus-X సస్పెన్షన్ సిస్టమ్‌లో ఇంటెలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ సూపర్‌కార్‌కి ఆల్ రౌండ్ కంట్రోల్‌ని అందిస్తాయి. కారు ముందు చక్రం పాడైపోయినా లేదా టైర్ కూడా పగిలినా, ఈ సస్పెన్షన్ సిస్టమ్ కారును కొద్దిగా ముందువైపుకు వంచుతుంది. దీని కారణంగా బ్రేక్ రోటర్లు రోడ్డును తాకవు. కారు ఎటువంటి సమస్య లేకుండా సాధారణంగా కదులుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ సిస్టమ్ బాడీ రోల్‌ను తగ్గించగలదని, రోల్‌ఓవర్ ప్రమాదాన్ని తగ్గించగలదని, అత్యవసర బ్రేకింగ్‌లో సహాయపడుతుందని కార్‌మేకర్స్ ప్రకటించారు. Disus-X సస్పెన్షన్ సిస్టమ్ ఆటోమేకర్ ఇంటెలిజెంట్ డంపింగ్, హైడ్రాలిక్, ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ ఎలా ఉందంటే..

యాంగ్‌వాంగ్ U9లో కంపెనీ క్వాడ్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను ఉపయోగించింది. ఇది 1,100bhp శక్తిని, 1,280Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదంట. అలాగే, ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 700 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుందని చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..