ఎండల్లో కూల్.. కూల్‌గా..! తక్కువ కరెంట్ ఖర్చు.. చౌకైన పోర్టబుల్ ఏసీ.. ఓ లుక్కేయండి..
మీరు కూడా కొత్తగా ఏసీ లేదా ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నట్లయితే.. ఒక్క క్షణం ఆగండి. ఎక్కువ డబ్బులతో ఈ రెండింటిని..
మాడు పగిలే ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.. గోడకు అమర్చే ఏసీని గానీ.. ఎయిర్ కూలర్ గానీ స్విచ్-ఆన్ చేయాల్సిందే. మరి మీరు కూడా కొత్తగా ఏసీ లేదా ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నట్లయితే.. ఒక్క క్షణం ఆగండి. ఎక్కువ డబ్బులతో ఈ రెండింటిని కొనుగోలు చేసే బదులు పోర్టబుల్ ఏసీలపై ఓ లుక్కేయండి. లో బడ్జెట్.. తక్కువ కరెంట్ వాడకంతో.. ఈ పోర్టబుల్ ఏసీలు మీ డబ్బును ఆదా చేస్తాయి. షార్ట్‌లిస్ట్ చేసి మీ ముందుకు ఒకటి తీసుకొచ్చేశాం. మరి దాని ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..
ఈ పోర్టబుల్ ఏసీ(ఎయిర్ కూలర్).. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ సింఫనీ(Symphony)లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7,499 కాగా 33 శాతం తగ్గింపుతో రూ. 4,999కి వస్తోంది. దీన్ని కూలింగ్ ఫ్యాన్‌గా.. అటు టేబుల్‌టాప్ స్పాట్ ఎయిర్ కూలర్‌గా వినియోగించుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని బెడ్‌రూమ్, స్టడీరూమ్ లేదా ఇంట్లో ఎక్కడైనా కూడా పెట్టొచ్చు. దీని ఫ్యాన్ తక్కువ సౌండ్ ఇవ్వడమే కాదు.. లోపల ఉండే హానీకంబ్ కూలింగ్ ప్యాడ్స్.. చక్కటి కూలింగ్‌ను రూమ్ అంతటికి పట్టేలా చేస్తాయి.
ఈ పోర్టబుల్ ఏసీకి 8 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉండగా.. ఇది మొత్తం 110 స్క్వేర్ ఫీట్ ఏరియాను కవర్ చేస్తుంది. పవర్ కట్ పోయిన కూడా దీన్ని ఇన్వెర్టర్ సాయంతో వినియోగించవచ్చు. అలాగే దీని ఛార్జింగ్‌కి 90 వాట్స్ కరెంట్ మాత్రమే అవసరమవుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి దీనిపై లుక్కేయండి.